https://oktelugu.com/

Shruti Haasan Tests Covid Positive: కరోనా బారిన పడిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌‌ !

Shruti Haasan Tests Covid Positive: కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నటులు కరోనా బారిన పడి, కోలుకోగా.. స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌‌ తాజాగా కరోనా బారిన పడ్డారు. స్వయంగా తనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. “అందరికీ నమస్కారం! ఇది అంత సరదాగా ఉండదు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నేను కోలుకుంటున్నాను. త్వరలో ఆరోగ్యంతో తిరిగి వస్తాను ! ధన్యవాదాలు, […]

Written By:
  • Shiva
  • , Updated On : February 27, 2022 / 06:12 PM IST
    Follow us on

    Shruti Haasan Tests Covid Positive: కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నటులు కరోనా బారిన పడి, కోలుకోగా.. స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌‌ తాజాగా కరోనా బారిన పడ్డారు. స్వయంగా తనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. “అందరికీ నమస్కారం! ఇది అంత సరదాగా ఉండదు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది.

    Shruti Haasan Tests Covid Positive

    నేను కోలుకుంటున్నాను. త్వరలో ఆరోగ్యంతో తిరిగి వస్తాను ! ధన్యవాదాలు, త్వరలో కలుద్దాం లవ్లీస్” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌ లో ఉండి ఆమె చికిత్స పొందుతుండగా.. త్వరగా ఆమె కోలుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శృతి హాసన్‌‌ కరోనాతో ఆస్పత్రి పాలైంది అనగానే ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    శృతి హాసన్‌‌ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆమెకు కరోనా వచ్చింది. అందుకే, దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి’ అని శృతి హాసన్‌‌ తన అభిమానులను కోరింది. మొత్తానికి శృతి హాసన్‌‌ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్. శృతి హాసన్‌‌ కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

    Also Read: అవి నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి – సమంత

    నిజానికి ఎంతో జాగ్రత్తగా ఉన్నా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. ఇలా ప్రముఖులు కూడా కరోనా పాజిటివ్ రావడం షాకింగ్ విషయమే. అయితే, శృతి హాసన్‌‌ కి తేలికపాటి జ్వరంతో పాటు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయట. అసలు కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు.

    అయితే, వరుసగా కేసులు నమోదు అవుతున్నా.. పెద్దగా ప్రభావం చూపించట్లేదు. కాకపోతే, నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్న సెల‌బ్రిటీల జాబితా కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

    Also Read: మరో మల్టీస్టారర్ ప్లాన్ లో అక్కినేని హీరోలు !

    Tags