Prabhas: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ప్రభాస్ నుంచి ఆదిపురుష్ అంటూ మరో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై రోజురోజుకు ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. పైగా ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. అయితే, ఆ సినిమాలు అన్నిటిలో కల్లా రామాయణ కావ్యం ఆధారంగా ఓంరౌత్ తెరకెక్కించనున్న భారీ పురాణగాథ ‘ఆదిపురుష్’ పై భారీ అంచనాలు ఉన్నాయి.

అన్నిటికి మించి టైటిల్ రోల్‌లో ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో 15 భారతీయ భాషలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా 20 వేల స్క్రీన్లపై సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. 20 వేల స్క్రీన్లపై సినిమా అంటే.. ఇది మామూలు సినిమా కాదు. భారీ రిలీజ్ అన్న లెక్క.
Also Read: ‘భళా తందనాన’ టీజర్ తో ఆకట్టుకుంటున్న శ్రీవిష్ణు
అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా కూడా అన్ని ప్రధాన భాషలతో పాటు జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా విడుదల కానుంది. అందుకే ఈ సినిమా కోసం అంతర్జాతీయ సాంకేతిక బృందాన్ని పెట్టుకుంటున్నారు. విఎఫ్ఎక్స్ వర్క్ కి సంబందించిన వర్క్ ను కూడా విదేశాల్లోనే చేయించాలని డిసైడ్ అయ్యారు.

ఈ చిత్రం కూడా గొప్ప స్థాయిలో గొప్పగా హిట్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. మరీ ఆదిపురుష్ ఎలా ఉంటుందో చూడాలి. ముఖ్యంగా రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడో చూడాలి.
Also Read:AP Employees Strike: పట్టుదలకు పోతే ఉద్యోగుల పని ఖతమేనా?