Russia- Ukraine War: ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర పోరు సాగుతోంది. పుతిన్ పన్నాగానికి బలవుతున్న ఉక్రెయిన్ ఏ స్థాయిలో కూడా భయపడటం లేదు. రెండు దేశాలు కయ్యానికే కాలు దువ్వుతున్నాయి. జన, ఆస్తి నష్టం సంభవిస్తున్నా లెక్క చేయడం లేదు. తమ పరువు ప్రతిష్టలే పెట్టుబడులుగా రెచ్చిపోతున్నాయి. రష్యా బాంబులతో విరుచుకుపడుతుంటే ఉక్రెయిన్ సైనికులతో సమాధానం చెప్పాలని భావిస్తోంది. ఇందుకోసం ఆ దేశ పౌరులను సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధాలు ఇచ్చి యుద్ధంలో పాల్గొనేలా చేస్తోంది. దీంతో రష్యా కూడా ధీటుగానే స్పందిస్తూ బాంబుల మోత మోగిస్తోంది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ను తమ దారికి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా రష్యా అత్యంత శక్తి వంతమైన ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. పుతిన్ చర్యలకు నోరెళ్లబెడుతున్నాయి. ఉక్రెయిన్ దాడిని అన్ని దారుల్లో ఖండిస్తున్నాయి.
యూరోపియన్ యూనియన్, నాటో దేశాలు, అమెరికా, జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాలు సైతం దాడులు ఆపాలని సూచిస్తున్నాయి. కానీ పుతిన్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఫలితంగా ఉక్రెయిన్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. రెండు దేశాల మధ్య శాంతిపూర్వక వాతావరణం కోసం భారత్ సైతం పాటుపడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడికి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ అమెరికాతో సన్నిహిత్యంగా ఉండటంతోనే జీర్ణించుకోలేని పుతిన్ దానిపై దాడికి తెగబడటం తెలుస్తోంది. నాటో సభ్య దేశంగా ఉండకూడదనేది కూడా మరో వాదన. దీంతో ఉక్రెయిన్ ను తమ హస్తగతం చేసుకుని దాని ఆగడాలు సాగకుండా చేయాలనేదే పుతిన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజం బెదిరింపులను సైతం లెక్కపెట్టకుండా యుద్ధానికి కాలు దువ్వింది.
దీంతో నష్టం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. తన మాటే నెగ్గాలనే పంతంతో ఉక్రెయిన్ ను ఇబ్బంది పెడుతున్న పుతిన్ చర్యలకు అందరు ఆశ్చర్యపోతున్నారు. ఉక్రెయిన్ పై దాడి చేసి ఏం సాధిస్తారని ప్రశ్నిస్తున్నారు.
Also Read: నాగబాబుపై రోజా సెటైర్లు.. భీమ్లా నాయక్‌ను ప్రభుత్వం తొక్కేయలేదంట..!