Priya Prakash Varrier : తడి అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తున్న ప్రియా ప్రకాష్ వారియార్.. ఫొటోలు వైరల్

ప్రియా బోల్డ్ షో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. సోషల్ మీడియా జనాలు ఆమె అందాలకు ముగ్దులవుతున్నారు. కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. ప్రియా ప్రకాష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Written By: NARESH, Updated On : October 16, 2023 8:05 pm
Follow us on

Priya Prakash Varrier :  ప్రియా ప్రకాష్ వారియర్ అనగానే మనకు కన్ను కొట్టుడు సన్నివేశం గుర్తొస్తుంది. ఈ మలయాళ భామ ఆ ఒక్క సన్నివేశంతో నేషనల్ వైడ్ పాప్యులర్ అయ్యింది. 2019లో విడుదలైన ‘ఒరు ఆడార్ లవ్’ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. హీరోయిన్ గా ఆమెకు మొదటి చిత్రం. క్లాస్ రూమ్ లో తన బాయ్ ఫ్రెండ్ తో కళ్ళతో మాట్లాడే సీన్ అప్పట్లో సోషల్ మీడియాను ఊపేసింది. ఈమె కన్నుకొట్టు సన్నివేశం దేశాన్ని ఊపేసిందంటే అతిశయోక్తి కాదు. ఆ మూవీ ఫలితం పక్కన పెడితే ప్రియా ప్రకాష్ కి పిచ్చ పాపులారిటీ దక్కింది. వరుస ఆఫర్స్ వచ్చాయి.

నెక్స్ట్ తెలుగులో చెక్ చిత్రం చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించారు. నితిన్ హీరోగా నటించిన చెక్ సైకలాజికల్ థ్రిల్లర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. చెక్ చిత్రంలో ప్రియా ప్రకాష్ పాత్ర నిడివి కూడా తక్కువే. ఆ వెంటనే తేజా సజ్జాకు జంటగా ఇష్క్ చిత్రం చేసింది. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సైతం ఆడలేదు. దాంతో ప్రియాకు తెలుగులో ఆఫర్స్ తగ్గాయి.

కొంచెం గ్యాప్ ఇచ్చి 2023లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో చిత్రంలో నటించింది. దర్శకుడు సముద్రఖని ఈ చిత్ర దర్శకుడు. తమిళ చిత్రం వినోదయ సితం రీమేక్ గా బ్రో తెరకెక్కింది. బ్రో మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్ సాయి ధరమ్ తేజ్ సిస్టర్ రోల్ చేయడం ఊహించని పరిమాణం. బ్రో హిట్ టాక్ తెచ్చుకుంది.

లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి బయోపిక్ ని తలపించేలా ప్రియా ప్రకాష్ ఓ చిత్రం చేసింది. ఆ చిత్ర టైటిల్ శ్రీదేవి బంగ్లా. శ్రీదేవి మరణంపై అనుమానాలు ఉండగా ఆమె బయోపిక్ గా శ్రీదేవి బంగ్లా చిత్రం రూపొందించారు. శ్రీదేవి బంగ్లా ట్రైలర్ చూసి కంగుతిన్న బోనీ కపూర్ లీగల్ యాక్షన్ తీసుకున్నాడు. దాంతో శ్రీదేవి బంగ్లా మూవీ మధ్యలో ఆగిపోయింది. ప్రస్తుతం హిందీతో పాటు మలయాళంలో ఆమె నటిస్తున్నారు.

అదే సమయంలో ఇంస్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటున్నారు. తాజాగా ఓ చెరువులో దిగి పెళ్లి కూతురు గెటప్ చీర ధరించి తడిసిన అందాల్లో హాట్ క్లివేజ్ షోకి తెరలేపింది. ప్రియా బోల్డ్ షో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. సోషల్ మీడియా జనాలు ఆమె అందాలకు ముగ్దులవుతున్నారు. కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. ప్రియా ప్రకాష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.