https://oktelugu.com/

Rashmika: ‘రారా సామీ’ స్టెప్పులతో ఇన్​స్టాలో రష్మిక వీడియో పోస్ట్​.. లక్షల్లో లైక్​లు

Rashmika: ప్రస్తుతం టాలీవుడ్​లో ఎక్కడ చూసినా పుష్ప మేనియా నడుస్తోంది. మరో రెండ్రోజుల్లో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు పుష్ప. సుకుమార్​ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్​, పాటలు నెట్టింట ట్రండింగ్​లో దూసుకెళ్లిపోతున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా తొలి భాగాన్ని పుష్ప ది రైజ్​ పేరుతో డిసెంబరు 17న విడుదల చేయనున్నారు మేకర్స్​. https://www.instagram.com/reel/CXc4EzMJb0X/?utm_source=ig_web_copy_link […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 12:39 PM IST
    Follow us on

    Rashmika: ప్రస్తుతం టాలీవుడ్​లో ఎక్కడ చూసినా పుష్ప మేనియా నడుస్తోంది. మరో రెండ్రోజుల్లో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు పుష్ప. సుకుమార్​ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్​, పాటలు నెట్టింట ట్రండింగ్​లో దూసుకెళ్లిపోతున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా తొలి భాగాన్ని పుష్ప ది రైజ్​ పేరుతో డిసెంబరు 17న విడుదల చేయనున్నారు మేకర్స్​.

    Rashmika

    https://www.instagram.com/reel/CXc4EzMJb0X/?utm_source=ig_web_copy_link

    అందుకు తగ్గట్లుగానే భారీ బడ్జెట్​తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్​ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హీరో, హీరోయిన్లు వరుసగా ఇంటర్వ్యూలకు అటెండ్​ అవుతున్నారు.

    Also Read: ‘పుష్ప’తో పని చేయనున్న రాజమౌళి?

    ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా, పుష్ప సినిమాలోని రారా సామి పాటకు స్టెప్పులేస్తూ.. ఇన్​స్టాగ్రామ్​లో వీడియో షేర్ చేసింది రష్మిక . ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది. రష్మిక క్యూట్​ ఎక్స్​ప్రెషన్స్​కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘చాలా మంది ఈ పాటకు రీల్స్‌ చేయడం చూశాను. అందుకే నేను కూడా ఈ పార్టీలో చేరాలని అనుకుంటున్నాను. నాలాగే ఇంకా చాలా మంది ఈ డ్యాన్స్‌ చేసి ఈ పార్టీలో చేరాలని కోరుకుంటున్నా.. అంటూ క్యాప్షన్‌ జోడించింది. ఈ వీడియో పోస్ట్​ చేసిన కొన్ని గంటల్లోనే 20 లక్షలకుపైగా లైక్​లు రావడం విశేషం.

    Also Read: పుష్పకు కష్టాలు మొదలయ్యాయి.. అల్లు అర్జున్ స్వయంకృపరాధం!