Homeఎంటర్టైన్మెంట్Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ కు నివాళి అర్పించేందుకు... టాలీవుడ్ నటులు

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ కు నివాళి అర్పించేందుకు… టాలీవుడ్ నటులు

Puneeth Raj Kumar: పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో కర్ణాటక వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పునీత్ లేని లోటుతో భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. తమ అభిమాన పునీత్ రాజ్ కుమార్ ఇక లేరనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  పునీత్ ను చివరిసారి దర్శించుకుని నివాళులు అర్పించడానికి… అభిమానులు భారీగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా పునీత్‌కు నివాళి అర్పిస్తున్నారు.

tollywood actors going to bangalore for puneeth raj kumar funeral

ఇక కన్నడ పవర్‌స్టార్‌తో టాలీవుడ్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఆయనను కడసారి చూసేందుకు పలువురు తెలుగు నటులు బెంగళూరుకు బయలుదేరనున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ బెంగళూరు బయలుదేరగా… మెగాస్టార్‌ చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్ మధ్యాహ్నం నుంచి బెంగళూరు వెళ్లనున్నారు. కంఠీరవ స్టేడియంలోని పునీత్‌ పార్థీవ దేహానికి చివరిసారిగా నివాళి అర్పించనున్నారు. ఇక నరేష్‌, శివబాలాజీ కూడా పునీత్‌ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

నిన్న ఉదయం తన ఇంట్లో జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు పునీత్‌. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే బెంగళూరు విక్రమ్‌ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. పునీత్ రాజ్ కుమార్ కుమార్ కుమార్తె ధృతి పునీత్ రాజ్ కుమార్ విదేశాల్లో  చదువుకుంటున్న విషయం తెలిసిందే.  కాగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆమె బెంగుళూరు చేరుకొనున్నారు. అనంతరం పునీత్ అంత్యక్రియలను ప్రభుత్వం లాంఛనంగా జరిపించనున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసింది. అలానే రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు మద్యపాన నిషేధం విధించింది. ప్రస్తుతం పునీత్ మరణ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version