https://oktelugu.com/

Karthika Deepam: దీప కనిపించకపోవడంతో కంగారు పడ్డ కార్తీక్… కార్తీక్ తో తాళి కట్టించుకునే ప్రయత్నంలో మోనిత?

స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా దీప ఏడుస్తూ అమెరికా ప్రయాణం ఎందుకు క్యాన్సిల్ చేశారు ఆ మోనిత అని అంటుండగా అందుకు కార్తీక్ కోప్పడుతూ ఎప్పుడు మోనిత గురించి ఆలోచన లేనా? పిల్లల గురించి ఆలోచించవా? అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు.దీంతో దీప నేను ఎన్నో ప్రశ్నలు అడుగుదామనుకుంటే మీరు నాకు ప్రశ్నలు వేసి వెళ్ళారా అంటూ బాధపడుతుంది. ఇక […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 30, 2021 / 12:16 PM IST
    Follow us on

    స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా దీప ఏడుస్తూ అమెరికా ప్రయాణం ఎందుకు క్యాన్సిల్ చేశారు ఆ మోనిత అని అంటుండగా అందుకు కార్తీక్ కోప్పడుతూ ఎప్పుడు మోనిత గురించి ఆలోచన లేనా? పిల్లల గురించి ఆలోచించవా? అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు.దీంతో దీప నేను ఎన్నో ప్రశ్నలు అడుగుదామనుకుంటే మీరు నాకు ప్రశ్నలు వేసి వెళ్ళారా అంటూ బాధపడుతుంది. ఇక తెల్లవారగానే సౌందర్య ఆనందరావుతో మాట్లాడుతూ ఏంటండీ రాత్రి సరిగా నిద్ర పట్టడం లేదా అని అడుగుతుంది.స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా దీప ఏడుస్తూ అమెరికా ప్రయాణం ఎందుకు క్యాన్సిల్ చేశారు ఆ మోనిత అని అంటుండగా

    కోపంలో ఉన్న ఆనంద రావుకు కార్తీక్ ఎదురు రావడంతో కార్తీక్ అని పిలవగా ఏంటి డాడీ అంటూ పక్కకు వెళ్తారు ముందుకు వెళ్ళిన కార్తీక్ ను పిలిచి ఎంతో కోపంతో సౌందర్య చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని కార్తీక్ కాలర్ పట్టుకొని ఏం చేసావ్ దౌర్భాగ్యుడా.. ఈ నిర్వాకం ఏమని చెబుతావు అంటూ ఆవేశ పడతాడు. అది చూసిన సౌందర్య ఏవండీ అంటుండగా అంతలో దీప అక్కడికి రావడంతో వెంటనే ఆనందరావు తన బుగ్గపై నిమురుతూ కనిపిస్తాడు. ఏంటి మావయ్య డాక్టర్ బాబు బుగ్గ పట్టుకున్నారు అంటూ దీప అనగా కార్తీక్ బుగ్గపై మచ్చ పడిందని చెప్పడంతో నాకు కనిపించలేదు మామయ్య ఉంటుంది.. నీకు ఎలా కనిపిస్తుంది అమ్మ నువ్వు చాలా దూరంగా ఉన్నావు కదా.. అని ఆనంద రావు అడగడంతో కాఫీ టీ ఏం తీసుకు రమ్మంటారా అత్తయ్య అని దీప అడగగా వాకింగ్ వెళుతున్నాం దీప అని సౌందర్య సమాధానం చెబుతుంది. పెళ్లి కాఫీ తీసుకురా అమ్మ మేము వాకింగ్ వెళ్లడం లేదని ఆనందరావు చెబుతాడు.

    అంతలో దీప లోపలికి వెళ్లడంతో ఆనందరావు కార్తీక్ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇప్పుడు దీపకు ఏమని సమాధానం చెపుతావు 11 సంవత్సరాలు దీపను దూరం పెట్టి మోనితకి దగ్గర అయ్యావు ఇప్పుడు ఏం చేస్తావ్ అంటూ నిలదీస్తాడు. ఇందుకేనా నేను బ్రతికింది ఈ ఘోరం చూడటానికి నా అంటూ బాధపడుతూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అంతలో దీప కాఫీలు తీసుకు వచ్చి ఫీల్ ఎక్కడ అని అడగడంతో వెళ్లారని కార్తీక్ సమాధానం చెబుతాడు. ఏం చెప్పలేదు అంటూ దీప అడగగా ఏం చెప్తారు పెద్దవాళ్ళు చెప్పాల్సింది చెప్పారంటూ కార్తీక్ కాఫీ తాగకుండా లోపలికి వెళ్లడంతో ఏదో జరుగుతుంది అది ఏదో తెలుసుకోవాలని ఉంది.

    మరోవైపు హాస్పిటల్లో తన బిడ్డను చూస్తూ మోనిత ఎంతో మురిసిపోతుంది. అంతలో భారతి వచ్చి ఏం తినలేదు అంట కదా అని అడగగా తినకపోతే ఎలా అంటూ.. ఈ పని చేయకముందే ఆలోచించుకోవాలి. ఇప్పుడు దీపకు తెలిస్తే నీ పరిస్థితి ఏంటి అంటూ భారతి అనడంతో అందుకు మోనిత తెలిస్తే ఏంటి లబోదిబోమంటూ ఏ నుయ్యో గోయ్యో చూసుకుంటుంది. నాకు మా ఆయన కార్తీక్ తాళి కడితే చాలు అదే ప్లాన్ లో ఉన్న అంటూ మరోసారి తన విలనిజాన్ని బయట పెడుతుంది. మోనిత మాటలు విన్న భారతి దీప పై జాలి చూపెడుతుంది. ఇక సౌందర్య కార్తీక్ మాట్లాడుతూ ఉండగా పిల్లలు పరిగెత్తుతూ వస్తూ నానమ్మ.. డాడీ.. మమ్మీ కనిపించడంలేదని చెప్పడంతో ఒక్కసారిగా కార్తీక్ సౌందర్య షాక్ అవుతారు.కార్తీక్ ఫోన్ చేయి బోతుండగా ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్ళిందని పిల్లలు చెప్పడంతో ఎక్కడికి వెళ్ళింది ఉంటుందని అందరూ కంగారు పడతారు. అయితే దీప ఎక్కడికి వెళ్ళింది ఏం చేయబోతోంది అనేది తర్వాత ఎపిసోడ్ లో తెలియనుంది.