https://oktelugu.com/

Tollywood Actors : కోట్ల రూపాయలు ఇచ్చి భార్యలను వదులుకున్న హీరోలు ఎవరో తెలుసా..?

Tollywood Actors : సినిమా ఇండస్ట్రీలో నటుల మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్లాగా వీరు కలిసి మెలిసి పనిచేయడంతో ఒకరిపై ఒకరికి ప్రేమ ఏర్పడుతుంది. అలా ఏర్పడిన ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తుంది. అయితే కొందరు ప్రేమ వరకు పులిస్టాప్ పెట్టి.. ఆ తరువాత వేరే వాళ్లతో పెళ్లి చేసుకుంటారు. కానీ కొందరు ప్రేమించిన వ్యక్తులను పెళ్లి చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నవారిలో కొందరు ఎక్కువరోజులు కలిసి ఉండలేదు. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2021 / 02:02 PM IST
    Follow us on

    Tollywood Actors : సినిమా ఇండస్ట్రీలో నటుల మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్లాగా వీరు కలిసి మెలిసి పనిచేయడంతో ఒకరిపై ఒకరికి ప్రేమ ఏర్పడుతుంది. అలా ఏర్పడిన ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తుంది. అయితే కొందరు ప్రేమ వరకు పులిస్టాప్ పెట్టి.. ఆ తరువాత వేరే వాళ్లతో పెళ్లి చేసుకుంటారు. కానీ కొందరు ప్రేమించిన వ్యక్తులను పెళ్లి చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నవారిలో కొందరు ఎక్కువరోజులు కలిసి ఉండలేదు. తొందర్లోనే విడాకులు తీసుకొని ఎవరిదారి వారు పట్టారు. అయితే కొందరు నటులు భరణి కొంద కోట్ల రూపాయలు చెల్లించి మరీ తాము ఎంతో ప్రేమించిన వ్యక్తులను విడిచిపెట్టారు. ప్రేమించుకున్నంతకాలం ఒకరినొకరు విడిచి ఉండలేమని భావించిన వారు చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అలా విడిపోయిన సినీ సెలబ్రెటీలు ఎవరో చూద్దాం..

    Also Read: Thaman: “గాడ్ ఫాదర్” సినిమాలో సల్మాన్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన తమన్…

    సంజయ్ కపూర్ -కరిష్మా కపూర్: 1990ల్లో వచ్చిన సినిమాల్లో కరిష్మాకపూర్ టాప్ హీరోయిన్. ఆ సమయంలో కరిస్మా సంజయ్ కపూర్ ను ప్రేమించింది. ఆ తరువాత వీరు పెళ్లి కూడ చేసుకున్నారు. ఆ తరువాత అమెరికాలో స్థిరపడ్డ వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఆ తరువాత వీరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా విడిపోయారు. అయితే సంజయ్ కపూర్ కరిష్మాకు అప్పట్లోనే రూ. 11 కోట్ల భరణం ఇచ్చి విడాకులు ఇచ్చారు.

    ప్రభుదేవా-రమాలత్: ప్రముఖ నటుడు, డ్యాన్సర్ గా గుర్తింపు పొందిన ప్రభుదేవా ఆల్ ఇండియా నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రభుదేవా రమాలత్ తో విడాకులు తీసుకున్న సమయంలో రూ.25 కోట్లతో పాటు ఖరీదైన కార్లను కూడా ఇచ్చాడు. అయితే నయనతారను పెళ్లి చేసుకునేందుకు ప్రభుదేవా ఇంత మొత్తం చెల్లించాల్సి వచ్చిందని టాక్.

    హృతిక్ రోషన్-సుజాన్ ఖాన్: బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తన చిన్ననాటి మిత్రురాలు సుజాన్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం తరువాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఈ సమయంలో సుజాన్ ఖాన్ కు రూ.5 కోట్ల మేర ఆస్తులను అప్పజెప్పారు. అంతేకాకుండా తన పిల్లలకు కూడా తన ఆస్తిలో వాటా ఉండేలా ఒప్పందం చేసుకున్నాడు.

    పవన్ కల్యాణ్-నందిని: పవన్ కల్యాన్ మొదటి భార్య నందిని. ఈమెను పెళ్లి చేసుకున్న పవన్ ఆ తరువాత రేణు దేశాయ్ తో చనువుగా ఉన్నాడు. దీంతో నందినికి పవన్ కల్యాన్ విడాకులు ఇచ్చి రూ. కోటి రూపాయలు భరణంగా ఇచ్చాడు. ఆ తరువాత పవన్ రేణు దేశాయ్ కి కూడా పవన్ విడాకులు ఇచ్చాడు. అయితే రేణుదేశాయ్ కి కూడా భరణం చెల్లించారని అంటున్నారు. కానీ రేణు దేశాయ్ ఆ వార్తలను కొట్టిపారేస్తుంది.

    Also Read: Tollywood Hero’s Marriages: ‘ఐటెం గర్ల్’లను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?