https://oktelugu.com/

83 Movie: 83 సినిమాలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కి డబ్బింగ్ చెప్పిన టాలీవుడ్ హీరో సుమంత్…

83 Movie: ఏక్ థా టైగర్,బజరంగీ భాయిజాన్, వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన కబీర్ ఖాన్ దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం “83”. లెజెండరీ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటించగా ఆయన సతీమణి స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె కపిల్ దేవ్ భార్యగా నటిస్తుంది. అలానే తమిళ్ యాక్టర్ హీరో జీవ […]

Written By: , Updated On : December 1, 2021 / 07:14 PM IST
Follow us on

83 Movie: ఏక్ థా టైగర్,బజరంగీ భాయిజాన్, వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన కబీర్ ఖాన్ దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం “83”. లెజెండరీ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటించగా ఆయన సతీమణి స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె కపిల్ దేవ్ భార్యగా నటిస్తుంది. అలానే తమిళ్ యాక్టర్ హీరో జీవ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. విశేషం ఏంటంటే తెలుగులో రణవీర్ పాత్రకు టాలీవుడ్ హీరో సుమంత్ డబ్బింగ్ చెప్పారట.

83 Movie

tollywood actor sumanth dubbing for ranveer singh in 83 movie

Also Read: ఆకట్టుకుంటున్న ‘శ్యామ్ ​సింగరాయ్’​ ప్రోమో.. నాని ఎలివేషన్​ అదుర్స్​

బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన “83” చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించనుంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేసుకుంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై కింగ్ నాగార్జున థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి కూడా  విపరీతమైన రెస్పాన్స్ లభించింది. కాగా, తెలుగు వెర్షన్ ’83’ లోని రణవీర్ సింగ్ పాత్రకు టాలీవుడ్ హీరో సుమంత్ అద్భుతంగా డబ్బింగ్ చెప్పి ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచారు. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ – ఫాంటమ్ ఫిలిమ్స్ సమర్పణలో కబీర్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌ పై దీపికా పదుకునే – కబీర్ ఖాన్ – విష్ణు వర్ధన్ ఇందూరి – సాజిద్ నడియావాలా నిర్మించారు. జూలియస్ ప్యాకియం, ప్రీతం చక్రబోర్తి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Also Read: ‘బంగార్రాజు’ సినిమా నుంచి త్వరలో మంచి మెలోడీ సాంగ్​.. ఆకట్టుకుంటున్న టీజర్