Homeఎంటర్టైన్మెంట్Mega Family: ఏపీలో వరద బాధితుల అండగా మెగా హీరోలు... విరాళాలు ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి,...

Mega Family: ఏపీలో వరద బాధితుల అండగా మెగా హీరోలు… విరాళాలు ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి, చరణ్

Mega Family: ఆంధ్రప్రదేశ్‏లో ఇటీవల కురిసిన వర్షాలతో రాయలసీమలోని జిల్లాలను అతలాకుతలం చేశాయి. స్థానిక ప్రజలు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విస్తారంగా కురిసిన వర్షాలకు చెట్లు, ఇళ్లు నెలమట్టం కాగా… లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మరోవైపు చిత్తూరు, కడప జిల్లాలు భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయాయి. వందల ఎకరాలు పంటనష్టం జరగగా, ఆస్తి నష్టం కూడా బారిగానే జరిగింది. కాగా వారికి ఏపీ ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలు వరద బాధితుల కోసం ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.

Mega Family
mega star chiranjeevi and ram charan donates money for ap flood victims

Also Read: త్వరలోనే ‘ఆచార్య’ నుంచి రెండు పెద్ద సర్​ప్రైజ్​లు

కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ వరద బాధితుల కోసం రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం వరద బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ లో వరదల విపత్తు బాధిత కుటుంబాలకు తన వంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్‏కి రూ. 25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. అలానే మెగాస్టార్ చిరంజీవి బాటలోనే ఆయన తనయుడు రామ్ చరణ్ సైతం వరధ బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా రూ. 25 లక్షలు ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. దీంతో చిరంజీవి, రామ్ చరణ్ ల నుంచి ఏపీ ప్రభుత్వ సహాయ నిధికి రూ. 50 లక్షలు విరాళం అందింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామని మెగా ఫ్యామిలి మరోసారి నిరూపించింది.

Also Read: నాగబాబుకు పని దొరికిందోచ్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version