https://oktelugu.com/

Ramya Krishna: స్టార్ హీరోయిన్స్ ని మించిపోయిన రమ్యకృష్ణ పారితోషికం

Ramya Krishna: సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాలు కొనసాగిన ఆర్తి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు రమ్య కృష్ణ గారు..ఈమెకి ఒకప్పుడు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..హీరోయిన్స్ అంటే కేవలం అందాల ఆరబోత మాత్రమే కాదు..అద్భుతంగా నటించగలరు కూడా అని చెప్పడానికి నిదర్శనంగా నిలిచినా హీరోయిన్ రమ్య కృష్ణ..ఇక కాలం పెరిగే కొద్దీ ప్రేక్షుకులు అభిరుచులు మారడం సహజమే..కొత్త హీరోయిన్స్ పుట్టుకొస్తున్న సమయం లో పాత హీరోయిన్స్ కి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 18, 2022 / 09:04 AM IST
    Follow us on

    Ramya Krishna: సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాలు కొనసాగిన ఆర్తి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు రమ్య కృష్ణ గారు..ఈమెకి ఒకప్పుడు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..హీరోయిన్స్ అంటే కేవలం అందాల ఆరబోత మాత్రమే కాదు..అద్భుతంగా నటించగలరు కూడా అని చెప్పడానికి నిదర్శనంగా నిలిచినా హీరోయిన్ రమ్య కృష్ణ..ఇక కాలం పెరిగే కొద్దీ ప్రేక్షుకులు అభిరుచులు మారడం సహజమే..కొత్త హీరోయిన్స్ పుట్టుకొస్తున్న సమయం లో పాత హీరోయిన్స్ కి క్రేజ్ తగ్గుతూ పోతుంది..కానీ హీరోయిన్స్ పాత్రలు వదిలి క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ వేస్తూ ఫుల్ బిజీ గా మారిన అలనాటి హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు..ఇప్పుడు రమ్య కృష్ణ కూడా ఆ కోవకి చెందిన వారే..దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లో శివగామి గా నటించి రమ్య కృష్ణ పాన్ ఇండియా లెవెల్ లో ఏ రేంజ్ క్రేజ్ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇండియన్ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన పాత్రలలో ఒకటి రమ్య కృష్ణ పోషించిన శివాగామి పాత్ర..అందుకే ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకి తీసుకుంటున్న పారితోషికం సోషల్ మీడియా లో సెన్సషనల్ టాపిక్ గా మారింది.

    Ramya Krishna

    ప్రస్తుతం రమ్య కృష్ణ ఒక్కో సినిమాకి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ నేడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారు కూడా తీసుకోవడం లేదు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఈమె ఒక్క రోజు కాల్ షీట్ విలువ అక్షరాలా 10 లక్షల రూపాయలట..ఈ ఏడాది అక్కినేని నాగార్జున మరియు నాగ చైతన్య హీరోలు గా నటించిన బంగార్రాజు సినిమాకి రమ్య కృష్ణ పది రోజుల కాల్ షీట్స్ ఇచ్చింది..పది రోజులకు గాను ఆమె దాదాపుగా కోటి రూపాయిల వరుకు తీసుకున్నట్టు తెలుస్తుంది..నేడు టాలీవుడ్ లో కుర్ర హీరోయిన్స్ గా కొనసాగుతున్న రాశి ఖన్నా ,నాభ నటేష్ వంటి వారు ఒక్కో సినిమాకు కేవలం 60 లక్షల రూపాయిలు మాత్రమే అందుకుంటున్నారు.

    Also Read: Rashmika Mandanna: ఫొటో గ్యాలరీ: జారిపోతున్న డ్రెస్ తో తెగ ఇబ్బంది పడ్డ రష్మిక మందన్నా?

    Ramya Krishna

    ఇక సౌత్ ఇండియా లో ప్రస్తుతం టాప్ 2 హీరోయిన్స్ గా కొనసాగుతున్న రష్మిక మరియు పూజ హెగ్డే వంటి వారి ఒక్కో సినిమాకు 1 కోటి 50 లక్షల నుండి రెండు కోట్ల రూపాయిల వరుకు పారితోషికం అందుకుంటున్నారు..రమ్య కృష్ణ కూడా వారితో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకోవడం విశేషం..రమ్య కృష్ణ ఒక సినిమాలో ఉందంటే కచ్చితంగా ఆ సినిమాకి కాస్త హైప్ వస్తుంది..అందుకే నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి ఏ మాత్రం కూడా వెనకాడడం లేదు అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

    Also Read:Mehreen Pirzada: 26 ఏళ్ళ హీరోయిన్ తో బాలయ్య – వెంకీ రొమాన్స్.. మధ్యలో రవితేజ కూడా !

    Tags