Nayanthara- Vignesh Shivan: గత నెల 9 వ తేదీన సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి తన ప్రియుడు విగ్నేష్ తో మహాబలిపురం లోని ఒక రిసార్ట్ లో ఘనంగా జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే..పెళ్లి జరిగిన తర్వాత ఈ జంట హానిమూన్ కి కూడా వెళ్లి వచ్చేసారు..అయితే అప్పట్లో వీళ్లిద్దరి వివాహ వేడుకకి సంబంధించి ఒక్క వీడియో కానీ , ఫోటో కానీ రాలేదు..దానికి కారణం వీళ్ళ పెళ్లిని నెట్ ఫ్లిక్స్ సంస్థ వారే జరిపించారు..ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వ పర్యవేక్షణ లో ఎంతో ఘనంగా క్రియేటివ్ గా ఈ పెళ్లిని జరిపించారు..ఆ పెళ్లి వీడియో తమ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసందుకు గాను పాతిక కోట్ల రూపాయిల డీల్ కూడా ఒప్పందం చేసుకున్నారు..అయితే కొన్ని షరతులు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని నెట్ ఫ్లిక్స్ సంస్థ చెప్పింది..అందులో ప్రధానంగా ఈ పెళ్ళికి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు బయటకి రాకూడదనే..తాళి కట్టిన ఫోటోలు అప్లోడ్ చేసుకునేందుకు అనుమతిని ఇచ్చినప్పటికీ..పెళ్లి కి వచ్చిన ముఖ్య అతిధుల ఫోటోలు మాత్రం సోషల్ మీడియా లో అప్లోడ్ చెయ్యకూడదు అని షరతు పెట్టారు.
కానీ ఇటీవల పొరపాటున నయనతార తన సోషల్ మీడియా అకౌంట్ వార రజినీకాంత్ మరియు సూర్య వంటి వారు హాజరైన ఫోటోలను అప్లోడ్ చేసింది..దీని వల్ల నెట్ ఫ్లిక్స్ సంస్థ నయనతార మరియు విగ్నేష్ దంపతులపై ఫైర్ అయ్యినట్టు సమాచారం..మా రూల్స్ ని బ్రేక్ చేసారని..మీతో కుదురించుకున్న 25 కోట్ల రూపాయిల డీల్ క్యాన్సిల్ చేస్తున్నామని నెట్ ఫ్లిక్స్ సంస్థ నయనతార మరియు విగ్నేష్ లకు ఝలక్ ఇచ్చింది..దీనితో ఈ జంట ఇప్పుడు అయ్యోమయ్యం లో పడింది.
Also Read: Ramya Krishna: స్టార్ హీరోయిన్స్ ని మించిపోయిన రమ్యకృష్ణ పారితోషికం
తేలిక చేసిన పొరపాటుకు ఒక భారీ డీల్ మిస్ అయిపోయాము అనే బాధలో ఉన్నారట ఈ జంట..ప్రస్తుతం నయనతార వరుస సినిమాలతో బిజీ గా గడుపుతుంది..తెలుగు లో ఆమె మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తుండగా..బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమా లో నటిస్తుంది..ఈ సినిమాకి ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు..పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తాను అని నయనతార గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో ఆమె తో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.
Also Read:Mehreen Pirzada: 26 ఏళ్ళ హీరోయిన్ తో బాలయ్య – వెంకీ రొమాన్స్.. మధ్యలో రవితేజ కూడా !