spot_img
Homeఎంటర్టైన్మెంట్Tollywood: టాలీవుడ్ లో మరో విషాదం... ప్రముఖ నటుడు రాజాబాబు కన్నుమూత

Tollywood: టాలీవుడ్ లో మరో విషాదం… ప్రముఖ నటుడు రాజాబాబు కన్నుమూత

Tollywood: చిత్ర పరిశ్రమ వరుస విషాదలను ఎదుర్కొంటుంది అనే చెప్పాలి. తాజాగా టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రాజబాబు కన్నుమూశారు. 64 సంవత్సరాలు వయసు గల ఆయన… కొన్నేళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 24 రాత్రి ఆయన మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.  ఆయన సినిమాల కంటే ఎక్కువగా సీరియల్స్‌ లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

tollywood actor raja babu died

1957 జూన్‌ 13న జన్మించిన  తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో ఈయన జన్మించారు. రాజబాబుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. రాజబాబుకు బాల్యం నుంచే రంగస్థలం మీద నటించడం అంటే ఎంతో ఇష్టం…  అందుకే చిన్ననాటి నుంచి సినిమాలతో మమేకం అయిపోయారు. కాగా అనేక నాటకాల్లో కూడా ఆయన నటించడం విశేషం.

1995లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఊరికి మొనగాడు చిత్రంతో రాజబాబు వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం వహించిన  సినిమాల్లో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. సింధూరం, సముద్రం, మురారి సినిమాల్లో రాజబాబు కనిపించారు. అలానే  ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను లాంటి సినిమాల్లో నటించారు. ఇటీవల విడుదలైన శ్రీకారం సినిమాలో కూడా నటించారు. దాదాపు 62 పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు రాజబాబు.

సినిమాలతో పాటు పలు సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి తదితర ధారావాహికల్లో ఆయన నటించారు. 2005లో అమ్మ సీరియల్‌లోని నటనకు గానూ ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది. స్వతహాగా చాలా మంచివారు అయిన అయ్యన హఠాత్తుగా మరణించడం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper