Tollywood: చిత్ర పరిశ్రమ వరుస విషాదలను ఎదుర్కొంటుంది అనే చెప్పాలి. తాజాగా టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రాజబాబు కన్నుమూశారు. 64 సంవత్సరాలు వయసు గల ఆయన… కొన్నేళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 24 రాత్రి ఆయన మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన సినిమాల కంటే ఎక్కువగా సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

1957 జూన్ 13న జన్మించిన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో ఈయన జన్మించారు. రాజబాబుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. రాజబాబుకు బాల్యం నుంచే రంగస్థలం మీద నటించడం అంటే ఎంతో ఇష్టం… అందుకే చిన్ననాటి నుంచి సినిమాలతో మమేకం అయిపోయారు. కాగా అనేక నాటకాల్లో కూడా ఆయన నటించడం విశేషం.
1995లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఊరికి మొనగాడు చిత్రంతో రాజబాబు వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమాల్లో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. సింధూరం, సముద్రం, మురారి సినిమాల్లో రాజబాబు కనిపించారు. అలానే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను లాంటి సినిమాల్లో నటించారు. ఇటీవల విడుదలైన శ్రీకారం సినిమాలో కూడా నటించారు. దాదాపు 62 పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు రాజబాబు.
సినిమాలతో పాటు పలు సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి తదితర ధారావాహికల్లో ఆయన నటించారు. 2005లో అమ్మ సీరియల్‌లోని నటనకు గానూ ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది. స్వతహాగా చాలా మంచివారు అయిన అయ్యన హఠాత్తుగా మరణించడం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.