https://oktelugu.com/

Tollywood: కిట్టి పార్టీల కి హాజరయ్యే 3 కోట్ల రూపాయలు మోసపోయిన హీరో..

Tollywood: సెలబ్రిటీస్ అయిన తర్వాత తమ జీవితాలను హుందాగా పార్టీలు, కిట్టి పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కిట్టి పార్టీలో ఏర్పాటు చేసి చాలామంది విఐపిల , రాజకీయ నాయకులు , సాధారణ వ్యక్తుల దగ్గర కూడా భారీగా డబ్బులు రాబట్టింది శిల్పా చౌదరి. కాగా శిల్పా చౌదరి అరెస్టు కావడంతో… ఆమె చేతిలో మోసపోయిన సెలబ్రిటీ లిస్టు బయట పెడుతున్నారు. దాదాపుగా 200 కోట్ల రూపాయలు దాకా టోపీ పెట్టినట్లు చెబుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 07:56 PM IST
    Follow us on

    Tollywood: సెలబ్రిటీస్ అయిన తర్వాత తమ జీవితాలను హుందాగా పార్టీలు, కిట్టి పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కిట్టి పార్టీలో ఏర్పాటు చేసి చాలామంది విఐపిల , రాజకీయ నాయకులు , సాధారణ వ్యక్తుల దగ్గర కూడా భారీగా డబ్బులు రాబట్టింది శిల్పా చౌదరి. కాగా శిల్పా చౌదరి అరెస్టు కావడంతో… ఆమె చేతిలో మోసపోయిన సెలబ్రిటీ లిస్టు బయట పెడుతున్నారు. దాదాపుగా 200 కోట్ల రూపాయలు దాకా టోపీ పెట్టినట్లు చెబుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి, హీరో సుదీర్ బాబు భార్య ప్రియదర్శిని… శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేసింది. ఇప్పుడు  అదే బాటలో తనని కూడా మోసం చేసిందని మరో హీరో కూడా ఫిర్యాదు చేశారు.

    అయితే శిల్పా చౌదరి లిస్టు మరో యంగ్ హీరో హర్ష్ మోసపోయారు. ఆమె  నిర్వహించే పార్టీలకు హాజరయ్యే వాడినని తన దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేసిందని హీరో హర్షు  ఫిర్యాదు చేశాడు. ఇక హీరో హర్షు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హర్షు  “సెహరి” సినిమా లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రియదర్శిని రెండు కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకొని… తనకు ఇవ్వలేదని అంతకు ముందు ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటివరకు నార్సింగిలో నాలుగు, జూబ్లిహీల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ పీఎస్ లో మొత్తం 8 కేసులు నమోదు చేశారు పోలీసులు. పోలీసుల విచారణలో శిల్పా బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.