https://oktelugu.com/

Akhanda Movie: “అఖండ” బృందానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ట్వీట్…

Akhanda Movie: “లెజెండ్” సినిమా విజయం తర్వాత అలాంటి విజయాన్ని “అఖండ” చిత్రంతో అందుకున్నారు నటసింహ బాలకృష్ణ. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడవ చిత్రం అఖండ. ఈ సినిమా బాలకృష్ణతో అనుకొన్న అప్పటినుండి ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచుకుంటూ వచ్చారు బోయపాటి. ఈ ఏడాది డిసెంబర్ 2 అఖండమైన విడుదలతో థియేటర్ లో ‘జై బాలయ్య’ నామజపంతో సందడి చేశారు.  థియేటర్ వద్ద బాలయ్య బాబు భారీ కటౌట్లు పెట్టి ఒక దీపావళి సృష్టించారు […]

Written By: , Updated On : December 3, 2021 / 07:48 PM IST
Follow us on

Akhanda Movie: “లెజెండ్” సినిమా విజయం తర్వాత అలాంటి విజయాన్ని “అఖండ” చిత్రంతో అందుకున్నారు నటసింహ బాలకృష్ణ. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడవ చిత్రం అఖండ. ఈ సినిమా బాలకృష్ణతో అనుకొన్న అప్పటినుండి ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచుకుంటూ వచ్చారు బోయపాటి. ఈ ఏడాది డిసెంబర్ 2 అఖండమైన విడుదలతో థియేటర్ లో ‘జై బాలయ్య’ నామజపంతో సందడి చేశారు.  థియేటర్ వద్ద బాలయ్య బాబు భారీ కటౌట్లు పెట్టి ఒక దీపావళి సృష్టించారు అభిమానులు.ఇక సినిమాపై విమర్శకులతో పాటు ప్రేక్షకులు కూడా పాజిటివ్ గా స్పందించగా మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు సైతం ఈ చిత్రం పై ప్రశంసలు కురిపించారు. “అఖండ” టీంకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

tdp president chandra babu naidu tweet about balayya akhanda movie

తాజాగా ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెషల్ ట్వీట్ చేశారు. అఖండమైన విజయం సాధించిన “అఖండ “సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ కు దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ సభ్యులకు అభిమానులకు అభినందనలు అంటూ చంద్రబాబు చిత్రబృందాన్ని అభినందించారు. ఇక సినిమా విజయవంతం కావడంతో బాలయ్య, డైరెక్టర్ బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తో పాటు చిత్రబృందం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా … ప్రముఖ హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో చెలరేగాడు. ఈ చిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.  ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రంలో నటించనున్నారు.