Homeఎంటర్టైన్మెంట్Tollywood Hero : సపోర్టింగ్ రోల్స్ చేస్తూ హీరోగా ఎదిగిన ఈ కుర్రాడు, టాలీవుడ్ లోనే...

Tollywood Hero : సపోర్టింగ్ రోల్స్ చేస్తూ హీరోగా ఎదిగిన ఈ కుర్రాడు, టాలీవుడ్ లోనే ధనవంతుడు! ఎవరో గుర్తు పట్టారా?

Tollywood Hero :  ఎవరి కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేం. కెరీర్ బిగింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఓ కుర్రాడు హీరోగా మారి.. సూపర్ హిట్స్ ఇచ్చాడు. కల్ట్ క్లాసిక్స్ గా చెప్పుకునే చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. యూత్ లో మంచి క్రేజ్ రాబట్టిన ఆ హీరో ఎవరో.. ఇప్పటికే మీరు గుర్తించే ఉంటారు. ఆ ఫోటో చిన్నప్పటి శర్వానంద్ ది. హైదరాబాద్ లో చదువుకున్న శర్వానంద్ కి రానా, రామ్ చరణ్ క్లాస్ మేట్స్. ఆ విధంగా టీనేజ్ నుండి శర్వానంద్ కి సినిమాలపై మక్కువ పెరిగింది. నటుడు కావాలని పరిశ్రమకు వచ్చాడు. కెరీర్ బిగినింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు.

శర్వానంద్ యువసేన చిత్రంలో లీడ్ రోల్ చేశాడు. నలుగురు యువకుల కథగా యువసేన తెరకెక్కింది. వారిలో ఒకరిగా శర్వానంద్ నటించాడు. అనంతరం గమ్యం మూవీతో బ్రేక్ వచ్చింది. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన గమ్యం మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది. గమ్యం మూవీలో అల్లరి నరేష్ మరో హీరోగా నటించాడు. శర్వానంద్ కెరీర్లో ప్రస్థానం కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకుడు. సాయి కుమార్, సందీప్ కిషన్ సైతం ప్రధాన పాత్రలు చేశారు.

Also Read : పవన్ కళ్యాణ్ OG సినిమా పోస్టర్ ని చూపించి భారీ స్కామ్.. రూ.1.34 కోట్లు కొట్టేశారు!

శర్వానంద్ కి ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం రన్ రాజా రన్. సాహో ఫేమ్ సుజీత్ మొదటి చిత్రంగా రన్ రాజా రన్ తెరకెక్కించారు. రొమాన్స్, క్రైమ్, రివేంజ్ అంశాలు జోడించి సుజీత్ తెరకెక్కించిన రన్ రాజా రన్ సూపర్ హిట్. శర్వానంద్ కి యూత్ లో ఈ చిత్రం గుర్తింపు తెచ్చింది. శతమానంభవతి, మహానుభావుడు వంటి హిట్స్ చిత్రాల్లో శర్వానంద్ నటించాడు. శర్వానంద్ ప్రస్తుతం స్ట్రగుల్ అవుతున్నాడు. మహానుభావుడు తర్వాత శర్వానంద్ కి క్లీన్ హిట్ లేదు. శర్వానంద్ హీరోగా మూడు చిత్రాలు తెరకెక్కుతున్నాయి.

కాగా శర్వానంద్ టాలీవుడ్ రిచెస్ట్ హీరోల్లో ఒకడు. అతడికి హైదరాబాద్ లో చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయట. వాటి విలువ వందల కోట్లు ఉంటుందట. అవన్నీ తన కుటుంబ ఆస్తులు అని శర్వానంద్ చెప్పుకొచ్చారు. గోల్డెన్ స్పూన్ తో పుట్టినప్పటికీ .. బాల్యం నుండి కష్టపడటం అలవాటు. అవసరాల కోసం పేరెంట్స్ మీద ఆధారపడే అలవాటు లేదని శర్వానంద్ చెబుతారు. సూపర్ హిట్ కొట్టి శర్వానంద్ కమ్ బ్యాక్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆయన చివరి చిత్రం మనమే. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

Also Read :చిరంజీవి అనిల్ రావిపూడి కథ ఆ టైమ్ పీరియడ్ లో రానుందా..?

Exit mobile version