Homeఆంధ్రప్రదేశ్‌Duvvada Srinivas: ఇక దువ్వాడ వంతు.. రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు.. అరెస్టు తప్పదా?

Duvvada Srinivas: ఇక దువ్వాడ వంతు.. రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు.. అరెస్టు తప్పదా?

Duvvada Srinivas: వైఎస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై తాజాగా కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై కేసు నమోదు కావడమే కాదు.. అరెస్ట్ కూడా జరిగింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు పోసాని కృష్ణ మురళి పై కూడా కేసు నమోదు అయింది. అరెస్టు జరిగింది. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వంతు వచ్చింది. ఆయన సైతం అరెస్టు చేస్తారని ప్రచారం నడుస్తోంది.

Also Read: విజయసాయిరెడ్డి యూ టర్న్.. జూన్ లో స్ట్రాంగ్ డెసిషన్.. చంద్రబాబు మాస్టర్ స్కెచ్!

 

* అసెంబ్లీకి వచ్చే క్రమంలో..
దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ) వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినట్లు ఓ ఫిర్యాదు అందింది జనసేన నేత నుంచి. అయితే ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదుల అందుతున్నాయి. వాటిపై కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల శాసనసభ సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి దువ్వాడ శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ నెలకు 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు అంటూ దువ్వాడ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో అసలు పవన్ కళ్యాణ్ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఎక్కడో దాక్కున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

* గుంటూరులో తొలి ఫిర్యాదు
అయితే పవన్ కళ్యాణ్ పై ( Pawan Kalyan)దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలపై తొలుత గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. జనసేన నాయకుడు కడప మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. ఇది అంశంపై విజయనగరంలోనూ దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవనిగడ్డతో పాటు మచిలీపట్నం పోలీస్ స్టేషన్లలో సైతం దువ్వాడ శ్రీనివాస్ పై కేసులు నమోదయ్యాయి. కోనసీమ జిల్లాలో జనసేన మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

* గతంలోనూ అనుచిత వ్యాఖ్యలు
రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతలపై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గట్టిగా వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. గతంలో కూడా వైసిపి హయాంలో పవన్ కళ్యాణ్ పై చాలా రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. చంద్రబాబుతో పాటు నాటి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు పై చాలా రకాలుగా మాట్లాడారు. బూతులతో రెచ్చిపోయేవారు. అయితే తాజాగా పవన్ పై చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఫిర్యాదులు వస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. దువ్వాడ అరెస్ట్ తప్పకుండా ఉంటుందని ప్రచారం నడుస్తోంది.

 

Also Read:  రాంగోపాల్ వర్మ కు భారీ ఊరట.. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version