https://oktelugu.com/

సునీత వయసు ఎంత.. రెండో పెళ్ళికి కారణమేంటి ?

సింగర్ సునీత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఇంతకీ, ఆమె వయసు ఎంత ? అసలు ఆమెకి అంత పెద్ద పిల్లలు ఎలా ఉన్నారంటే.. ఆమె వయసు ఎక్కువా ? అసలు ఆమె ఇప్పుడు ఉన్నట్టు ఉండి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు ? ఇలా సాగుతున్నాయి నెటిజన్లు ప్రశ్నలు. రామ్ సూరపనేని అనే ఒక డిజిటల్ మీడియా కంపెనీ ఓనర్ తో సునీతకి నిశ్చితార్థం జరిగిన దగ్గర నుండి సునీత పై సోషల్ మీడియాలో అనేక […]

Written By:
  • admin
  • , Updated On : December 9, 2020 / 04:19 PM IST
    Follow us on


    సింగర్ సునీత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఇంతకీ, ఆమె వయసు ఎంత ? అసలు ఆమెకి అంత పెద్ద పిల్లలు ఎలా ఉన్నారంటే.. ఆమె వయసు ఎక్కువా ? అసలు ఆమె ఇప్పుడు ఉన్నట్టు ఉండి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు ? ఇలా సాగుతున్నాయి నెటిజన్లు ప్రశ్నలు. రామ్ సూరపనేని అనే ఒక డిజిటల్ మీడియా కంపెనీ ఓనర్ తో సునీతకి నిశ్చితార్థం జరిగిన దగ్గర నుండి సునీత పై సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి. సునీతకు త్వరలోనే పెళ్లి.. ఆమె కాబోయే భర్తది కూడా రెండో వివాహమే.. అంటూ ఏవేవో కామెంట్స్.. వీటిల్లో ఓ కామెంట్ తెగ వైరల్ అవుతొంది. సునీత ఎదిగిన పిల్లలను చూసి, ఆమె కూడా సంతూర్ మమ్మీనా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: ‘అల్లు స్నేహ’ వదిన ఆ గ్లాస్ దాచండి !

    నిజానికి సునీత వయసు ప్రస్తుతం 43 సంవత్సరాలు. ఆమెది సొంతూరు గుంటూరు. సునీతకు ఇంటర్ చదువుతున్న టైంలోనే సినిమా పాట పాడే అవకాశం రావడంతో 1995లో “గులాబీ” సినిమా కోసం “ఈ వేళలో ఏమి చేస్తూ ఉంటావో” అనే పాట పాడి.. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఆ తర్వాత రెండేళ్లకే కిరణ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. పెద్దలకు ఇష్టం లేకపోయినా అతన్ని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ వెంటనే ఆమెకు పిల్లలు పుట్టారు. ఇరవై ఏళ్ళు వచ్చేసరికే ఇద్దరు పిల్లల తల్లి అయింది. అలా సునీతకి మొదటి భర్త వల్ల ఇద్దరు పిల్లలు కలిగారు.

    Also Read: పక్కా కామెడీ చేయబోతున్న రవితేజ !

    సునీత కొడుకు ఆకాష్, కూతురు శ్రేయ ఇప్పుడు పెద్దవాళ్లయ్యారు. ఆకాష్ అమెరికాలో చదువుకుని వచ్చి.. ప్రస్తుతం ఢిల్లీలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ లైఫ్ లో సెటిల్ అయ్యాడు. అలాగే కూతురు శ్రేయ ప్రస్తుతం చదువుకుంటుంది. పైగా శ్రేయ ఇప్పటికే సినిమాల్లో పాట కూడా పాడి తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది. కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ లో ఆమె మరో సాంగ్ కూడా పాడనుంది. మొత్తనికి పిల్లలు ఇద్దరూ సెటిల్ కావడంతో సునీత.. మళ్ళీ పెళ్లి చేసుకోని తనకు ఓ తోడును వెతుక్కుంది. తానూ పెళ్లి చేసుకోవడానికి కారణం.. పిల్లలు లైఫ్ లో సెటిల్ అవ్వడమేనట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్