https://oktelugu.com/

Viral Cinema: వైరల్ అవుతున్న టుడే మూవీ అప్ డేట్స్

Viral Cinema:  సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సంగీత సంచలనం దేవీ శ్రీ ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ‘ఆడ వాళ్లు మీకు జోహార్లు’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో దేవి పాల్గొన్నాడు. పాల్గొంటే పాల్గొన్నాడు. అనవసరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు కిషోర్ తిరుమలను ఉద్దేశిస్తూ..‘‘ఈయన ఎప్పుడూ మాలలోనే ఉంటారు. మాకేమో శీలా, మాలా, సీత, గీత వంటివి మాకు తెలుసు అంటూ దేవీ శ్రీ మాట్లాడాడు. అయితే, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 2, 2022 / 02:43 PM IST
    Follow us on

    Viral Cinema:  సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సంగీత సంచలనం దేవీ శ్రీ ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ‘ఆడ వాళ్లు మీకు జోహార్లు’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో దేవి పాల్గొన్నాడు. పాల్గొంటే పాల్గొన్నాడు. అనవసరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు కిషోర్ తిరుమలను ఉద్దేశిస్తూ..‘‘ఈయన ఎప్పుడూ మాలలోనే ఉంటారు. మాకేమో శీలా, మాలా, సీత, గీత వంటివి మాకు తెలుసు అంటూ దేవీ శ్రీ మాట్లాడాడు. అయితే, ఈ వివాదస్పద వ్యాఖ్యలపై BJP MLA ఫైర్ అయ్యారు. దేశీ శ్రీ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    devi sri prasad

    మరో అప్ డేట్ విషయానికి వస్తే.. సిఆర్ విజయ్ దేవరకొండతో పెళ్లి విషయంలో హీరోయిన్ రష్మిక స్పందించింది. ‘ఆ వార్తలు నా దృష్టికి కూడా వచ్చాయి. అవన్నీ టైం పాస్ అబ్బా. ఇలాంటివి కొత్తేం కాదు. వాటిని విని నవ్వుకోవడం అలవాటైపోయింది. ప్రేమించి, పెళ్లి చేసుకునేంత టైం నా దగ్గర లేదు’ అని చెప్పింది. ఇప్పటికే ఈ పెళ్లి వార్తలను విజయ్ దేవరకొండ సైతం కొట్టిపడేశాడు.

    Also Read:   ఒకే పార్టీలో ధనుష్‌ – ఐశ్వర్య.. కానీ పలకరింపు లేదు

     

    Rashmika Mandanna

    ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. కరోనా వల్ల‌ సినీ ఇండ‌స్ట్రీపై భారీ ప్ర‌భావ‌మే ప‌డింది. క‌రోనా తగ్గిన తర్వాత రిలీజైన ‘అఖండ’, ‘పుష్ప’, ‘భీమ్లా నాయక్ సినిమాలు విజయాలు అందుకోవడంతో టాలీవుడ్ కు కొత్త జోష్ వచ్చింది. ఈ మేరకు ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ ఈనెల 11న, మెగా పాన్ ఇండియా మూవీ RRR ఈనెల 25న విడుదలకు సిద్ధం అవుతోంది.

    Radhe Shyam

    అక్షయ్ కుమార్ మూవీ బచ్చన్ పాండే సైతం ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ భారీ పోటీలో ఏ సినిమా విజేతగా నిలుస్తోందో ? ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతుందో తెలియని పరిస్థితి ఉంది.

    Also Read:  రానా ఇన్ని సూప‌ర్ హిట్ మూవీలు వ‌దులుకున్నాడా.. అవ‌న్నీ చేసుంటే పెద్ద స్టార్ అయ్యేవాడేమో..

    Tags