పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’, ‘హరిహర వీరమల్లు’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వచ్చే నెలలో మరో సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు. దర్శకుడు హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కలయికలో ఓ సినిమా రాబోతుంది. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డేను ఫైనల్ చేశారట. అన్నట్టు ఈ చిత్రానికి ‘భగత్ సింగ్’ అనే టైటిల్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హిట్ సినిమా “సోగ్గాడే చిన్ని నాయన” సీక్వెల్ బంగార్రాజు కొత్త షెడ్యూలు షూటింగ్ మైసూర్ లో మొదలు అయింది. ఈ షూట్ లో నాగార్జునతో పాటు చైతు, అలాగే కీర్తి శెట్టి కూడా పాల్గొంది. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ స్వర్గం సెట్ వేశాడు.
హోమ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఆల్ రెడీ ’18 పేజెస్’, ‘కార్తికేయ 2’లో నటిస్తోన్న అనుపమ, హీరో రామ్ కొత్త సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది.