Vijay Sethupathi : టాలీవుడ్ లో ఇప్పుడు అందానికే ఈర్ష పుట్టే అందంతో దూసుకొచ్చింది కృతిశెట్టి. ఉప్పెన సినిమాలో ‘కృతి’ చూపించిన అందాలు తెలుగు నాట ఫిదా కాని వారు ఎవరూ లేరు. ఆ సినిమా సక్సెస్ అయ్యిందంటే దానికి కారణం కృతిశెట్టినే. హీరో వైష్ణవ్ తేజ్ తో కృతి చేసిన రోమాన్స్ ఆ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాలో కృతిశెట్టి తండ్రిగా విలన్ గా నటించాడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి. కూతురు ఒక తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని తెలుసుకొని అతడిపై ప్రతీకారం తీర్చుకునే పాత్రలో విజయ్ బాగా నటించాడు.
అయితే తాజాగా ‘లాభం’ అనే రైతు నేపథ్య చిత్రంతో మనముందుకు విజయ్ సేతుపతి వస్తున్నాడు. ఆ సినిమా తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని విజయ్ పంచుకున్నాడు.
తాను హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా ‘కృతిశెట్టి’ని ఎంపిక చేసిన చిత్రం యూనిట్ ఆ ఫొటోను తనకు పంపించిందని.. కానీ నేను కృతిని రిజెక్ట్ చేశానని.. ఈ సినిమాలో ఆమెతో రోమాన్స్ చేయలేనని చెప్పి వద్దని సూచించినట్టు తెలిపారు.
‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మ పాత్రలో కూతురుగా కృతిశెట్టి నటించగా.. ఆమె తండ్రిగా విజయ్ సేతుపతి నటించాడు. ఈ క్రమంలోనే కూతురు పాత్ర పోషించిన ఆమెతో రోమాన్స్ చేయలేను అని.. కాబట్టి ఆమె వద్దు అని చెప్పినట్టు విజయ్ తెలుపడం విశేషం.
‘ఉప్పెన’ సినిమా క్లైమాక్స్ సన్నివేశాన్ని ఈ సందర్భంగా విజయ్ గుర్తు చేసుకున్నాడు. క్లైమాక్స్ లో ఎమోషన్ సీన్లలో కృతి భయపడుతుంటే.. నేనే ధైర్యం చెప్పాడనని.. ‘నాకు నీ వయసు కొడుకు ఉన్నాడు.. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే.. భయపడకు.. ఎలాంటి కంగారు లేకుండా ధైర్యంగా చెయ్’ అని ప్రోత్సహించానని.. కూతురిలా భావించిన ఆమెకు జోడీగా నటించడం నా వల్ల కాదు’ అని విజయ్ సేతుపతి మీడియా ముందు చెప్పడం సంచలనమైంది.
తెలుగులో ఇలా తండ్రీకూతుళ్ల పక్కన నటించిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. హీరోయిన్ కాజల్ రాంచరణ్ తో, చిరంజీవితో నటించింది. కానీ నైతిక విలువలతో విజయ్ సేతుపతి తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసలు కురిపిస్తోంది. విజయ్ పై అభిమానం మరింత పెరిగిందని చెబుతున్నారు.