https://oktelugu.com/

OKTelugu MovieTime: టుడే మూవీ క్రేజీ అప్ డేట్స్

OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటి పూజా మిశ్రా సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హాపై సంచలన ఆరోపణలు చేసింది. సిన్హా తన కుమార్తె సోనాక్షి సిన్హా భవిష్యత్తు కోసం తన కన్యత్వాన్ని అమ్మేశాడని, తనను వ్యభిచారిగా మార్చాడని పూజా మిశ్రా వెల్లడించింది. ఫ్యాషన్ డిజైనర్ గానే ఉండిపోవాల్సిన సోనాక్షి కోసం తన జీవితాన్ని బలిచ్చారని తెలిపింది. తన తండ్రి, శత్రుఘ్నసిన్హా స్నేహితులని, సిన్హాకు తన తండ్రి కోట్ల […]

Written By:
  • Shiva
  • , Updated On : May 6, 2022 / 11:09 AM IST
    Follow us on

    OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటి పూజా మిశ్రా సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హాపై సంచలన ఆరోపణలు చేసింది. సిన్హా తన కుమార్తె సోనాక్షి సిన్హా భవిష్యత్తు కోసం తన కన్యత్వాన్ని అమ్మేశాడని, తనను వ్యభిచారిగా మార్చాడని పూజా మిశ్రా వెల్లడించింది. ఫ్యాషన్ డిజైనర్ గానే ఉండిపోవాల్సిన సోనాక్షి కోసం తన జీవితాన్ని బలిచ్చారని తెలిపింది. తన తండ్రి, శత్రుఘ్నసిన్హా స్నేహితులని, సిన్హాకు తన తండ్రి కోట్ల రూపాయల డబ్బు కూడా ఇచ్చాడని తెలిపింది.

    OKTelugu MovieTime

    మరో అప్ డేట్ ఏమిటంటే.. హీరో సూర్యపై FIR నమోదు చేయాలంటూ సైదాపేట కోర్టు ఆదేశించింది. సూర్య నటించిన “జై భీమ్” చిత్రం గతేడాది రిలీజై ఘన విజయం అందుకుంది. అయితే ఈ చిత్రంలో వన్నియార్ కులస్తుల గురించి అవమానకర రీతిలో చూపించారని ఆ సంఘం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. హీరో సూర్యతో పాటు ఆయన భార్య జ్యోతిక, చిత్ర దర్శకుడులపై కేసు నమోదు చేయాలని చెన్నై పోలీసులను ఆదేశించింది.

    Also Read: Bhala Thandanana Review: రివ్యూ : ‘‘భళా తందనాన’

    Suriya

    ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ షోకు ఇకపై ముగింపు పలుకుతున్నట్లు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ షో 7వ సీజన్ ను ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించాడు. తాజాగా ప్రసారం కానున్న ఈ సీజన్‌లో బాలీవుడ్‌తో పాటు సౌత్ సెలబ్రిటీలు కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో అల్లు అర్జున్, సమంత, రష్మిక మందన్న, తారక్, రామ్ చరణ్ ఉన్నట్లు సమాచారం.

    Koffee with Karan

    అలాగే ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. తెలుగు సినీ చరిత్రలోనే మహేష్‌ బాబు ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. సర్కారు వారి పాట ద్వారా ట్విట్టర్‌ ఎమోజీని దక్కించుకున్న తొలి టాలీవుడ్‌ హీరోగా ఘనతను సాధించాడు. నేటి నుండి ఈ ఎమోజీ ట్విట్టర్‌లో దర్శనమివ్వనుంది. ఇక మే 7న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని యూసఫ్‌గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో ప్లాన్‌ చేశారు. ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌ ఎవరనేది సస్పెన్స్‌లో ఉంచగా, పవన్‌ కళ్యాణ్‌, రాజమౌళి పేర్లు వినిపిస్తున్నాయి.

    Also Read:Viswak Sen: విశ్వ‌క్‌ సేన్‌ కు వాళ్ళ స‌పోర్ట్‌… ర‌చ్చ మళ్లీ మొదలైంది !

    Tags