Bhala Thandanana Review: రివ్యూ : ‘‘భళా తందనాన’
రేటింగ్ 2 /5
నటీనటులు : శ్రీవిష్ణు, కేథరిన్ త్రెసా, గరుడ రామ్, పోసాని కృష్ణ మురళి, శ్రీనివాస రెడ్డి, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ.
దర్శకుడు : చైతన్య దంతులూరి
నిర్మాత : రజనీ కొర్రపాటి
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రాఫర్ : సురేష్ రగుతు
ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్
చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు – కేథరిన్ హీరో హీరోయిన్ గా వారాహి చలన చిత్రం నిర్మించిన కొత్త సినిమా ‘భళా తందనాన’. మనీ రోబరి నేపథ్యంలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం..
Also Read: Viswak Sen: విశ్వక్ సేన్ కు వాళ్ళ సపోర్ట్… రచ్చ మళ్లీ మొదలైంది !
కథ :
శశి (కేథరిన్) పవర్ ఫుల్ జర్నలిస్ట్. చాలా మంది రాజకీయ నాయకుల చీకటి కోణాలను బహిర్గతం చేస్తూ అనేక కథనాలను ప్రసారం చేస్తూ ఉంటుంది. మరోపక్క చందు (శ్రీవిష్ణు) ఒక అమాయకుడు, ఒక అనాథాశ్రమంలో అకౌంటెంట్‌గా పనిచేస్తుంటాడు. ఒక సంఘటన కారణంగా చందు – శశి సన్నిహితులుగా మారతారు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో భయంకరమైన విలన్ ఆనంద్ బాలి (రామచంద్రరాజు) వీరి జీవితాల్లోకి ఎంట్రీ ఇస్తాడు. అసలు అతను వీళ్ళను ఎందుకు టార్గెట్ చేశాడు ? చందు శశి మధ్య ఏమి జరుగుతుంది ? అసలు చందు ఎవరు ? అతని వెనుక ఉన్న కథ ఏమిటి ? చివరకు వీళ్ళ జీవితాలు ఎలా ముగిసాయి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఈ క్రైమ్ యాక్షన్ డ్రామాలో ఎమోషనల్ పాత్రలో నటించిన శ్రీవిష్ణు, ఆ పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకుంటూ కొన్ని కీలకమైన సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన రామచంద్రరాజు చాలా సహజంగా నటించాడు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ ఎప్పటిలాగే తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు.
పోసాని కూడా తన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఆయన నటన చాలా బాగుంది. అలాగే సినిమాలో కీలక పాత్రలో నటించిన సత్య కూడా తన నటనతో సినిమాకి ప్రత్యేక ఆకర్షణలా నిలిచాడు. ఇక మిగిలిన నటీనటులు గరుడ రామ్, శ్రీనివాస రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
అయితే సినిమాలో మ్యాటర్ లేదు. రెగ్యులర్ ప్లే, ఫేక్ ఎమోషన్స్, లాజిక్ లేని ల్యాగ్ సీన్స్ అండ్ రొటీన్ సీన్స్.. మొత్తంగా ఈ సినిమా బోర్ కొడుతుంది. చైతన్య బలమైన స్క్రిప్ట్ రాసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్ :
శ్రీ విష్ణు నటన,
నేపథ్య సంగీతం,
కొన్ని సస్పెన్స్ సీన్స్,
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ ప్లే,
రొటీన్ డ్రామా,
హీరోయిన్ ట్రాక్,
లాజిక్స్ మిస్ అవ్వడం,
బోరింగ్ ట్రీట్మెంట్,
సినిమా చూడాలా ? వద్దా ?
రొటీన్ క్రైమ్ డ్రామా వ్యవహారాలతో సాగినా.. ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ అండ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే శ్రీ విష్ణు నటన అండ్ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. అయితే కేవలం క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వాళ్లే ఈ సినిమా చూడొచ్చు.
Also Read:Mehreen Pirzada: బాలీవుడ్ ఛాన్స్ కోసం అంత పని చేసిందా ?