Sukumar : సుకుమార్ తో సినిమా చేయాలంటే ఆ హీరోలకి ఒక లక్షణం ఉండాలి…

Sukumar మిగిలిన హీరోలు అందరిని కవర్ చేస్తూ తను ఇక ముందు సినిమాలు చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

Written By: NARESH, Updated On : June 9, 2024 9:43 pm

Allu Arjun gave a test to Sukumar for Arya movie

Follow us on

Sukumar : ఆర్య సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి తన క్రేజ్ ఏంటో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక సుకుమార్ డైరెక్షన్ లో నటించడానికి చాలా మంది హీరోలు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

కానీ సుకుమార్ మాత్రం కొంతమంది హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కి ఎలాంటి హీరో అయితే సెట్ అవుతాడో, ఆయన ఎలా చెబితే అలా యాక్టింగ్ చేసే హీరోలను మాత్రమే తను పెట్టి సినిమా చేస్తాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా హీరోలకు మంచి గుర్తింపును కూడా తీసుకొస్తూ ఉంటాయి. ఇక ఇప్పటివరకు ఆయన చాలా తక్కువ మంది హీరోలతోనే సినిమాలు చేశారు. అందులో అల్లు అర్జున్ తో దాదాపు నాలుగు సినిమాలు చేసి మంచి బాండింగ్ ని ప్రూవ్ చేసుకున్నారు…

రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలతో కూడా తను సినిమాలు చేశాడు. ఇక తనతో సినిమాలు చేయని హీరోలు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళతో కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా డైరెక్టర్ ఎలా చెప్తే అలా సినిమాలు చేస్తూ ముందుకు సాగే వారు కావడం వల్ల మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ ఆయన డైరెక్షన్ లో నటించే కెపాసిటీ ఉన్నవాళ్లు కావడం విశేషం…

మిగిలిన హీరోలు అందరిని కవర్ చేస్తూ తను ఇక ముందు సినిమాలు చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి సుకుమార్ తర్వాత మన స్టార్ హీరోలతో ఎలాంటి సక్సెస్ లను అందుకుంటాడు అనేది…