NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న మన హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి నటులు పాన్ ఇండియాలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమా తో భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ ని కూడా భారీగానే సంపాదించాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ సాధించి పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదిగే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో ప్రస్తుతం చాలామంది దర్శకులు సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ క్రమంలోనే ఆయన ఎవరికి డేట్ ఇస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకునే దర్శకుల దగ్గర ఒక క్వాలిటీ మాత్రం ప్రత్యేకంగా ఉండాలట.
అది ఏంటి అంటే ఎన్టీఆర్ తో సినిమా చేసేటప్పుడు ప్రతి ఒక్క దర్శకుడు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటూ మనం ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు ఆయన ఆ దర్శకుడి మీద పూర్తిగా నమ్మకాన్ని పెడతాడని ఆయన ఏది చెప్తే అది చేయడానికి తను సిద్ధంగా ఉంటారని కూడా కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి.
ఇక కథ విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ లాంటి నటుడుతో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు అనుకుంటాడు. కాబట్టి వాళ్ళందరూ ఇలాంటి టిప్స్ ని వాడుతూ ఆయన దగ్గరికి వెళ్తే బెస్ట్ అని కొంతమంది సీనియర్ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పాన్ ఇండియాలో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తన తోటి హీరోలు స్టార్ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళతో పోటీ పడాల్సిన అవసరం అయితే ఉంది…