https://oktelugu.com/

Prashanth Neel: ఎన్టీఆర్ తో సినిమా ముగిసేదాక మరో సినిమా చేయవద్దు.. హీరోయిన్ కు ఊహించని కండీషన్ పెట్టిన ప్రశాంత్ నీల్

దేవర సక్సెస్ తో ఊపులో ఉన్న ఎన్టీఆర్ వరుస చిత్రాలు చేసే యోచనలో ఉన్నారు. ఆయన ప్రస్తుత వార్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. నెక్స్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పని చేయనున్నాడు. కాగా ఈ ప్రాజెక్ట్ కోసం ఒక క్రేజీ హీరోయిన్ ని ఎంపిక చేశారట. ఆ యంగ్ బ్యూటీకి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ కఠిన నియమం పెట్టాడట.

Written By:
  • S Reddy
  • , Updated On : December 2, 2024 / 11:55 AM IST

    Prashanth Neel(1)

    Follow us on

    Prashanth Neel: కొన్నేళ్లుగా ఎన్టీఆర్ కి అపజయం లేదు. టెంపర్ అనంతరం ఎన్టీఆర్ నటించిన చిత్రాలన్నీ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్… రామ్ చరణ్ తో పాటు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాడు. రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్… రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు ఈ మూవీ సొంతం చేసుకుంది. దేవర మూవీతో ఎన్టీఆర్ మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఫస్ట్ హీరో ఎన్టీఆర్ అయ్యాడు.

    రాజమౌళితో మూవీ చేసిన ప్రతి హీరో తదుపరి చిత్రం డిజాస్టర్ అయ్యింది. రామ్ చరణ్ ని ఆచార్య రూపంలో ఈ సెంటిమెంట్ వెంటాడింది. దేవర వరల్డ్ వైడ్ రూ 500 కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాల్లో దేవర పెద్ద మొత్తంలో లాభాలు పంచింది. హిందీ వెర్షన్ రూ. 60 కోట్ల వసూళ్లతో హిట్ స్టేటస్ రాబట్టింది. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హృతిక్ రోషన్ తో చేస్తున్న ఈ మల్టీస్టారర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్.

    ఎన్టీఆర్ లో లైన్లో పెట్టిన మరొక ప్రాజెక్ట్ ప్రశాంత్ ది. ఈ కెజిఎఫ్ దర్శకుడు చాలా కాలం క్రితమే ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఎట్టకేలకు అది పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. చైనా, భూటాన్ దేశాలను గడగడలాడించిన ఒక డ్రగ్ మాఫియా లీడర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ని ఎంపిక చేశారనేది లేటెస్ట్ న్యూస్.

    ఈ కన్నడ భామ గోల్డెన్ ఆఫర్ కొట్టేసిందట. ఎన్టీఆర్ తో జతకట్టే ఛాన్స్ పట్టేసిందట. ఈ మేరకు చర్చలు జరిగాయని, ఎన్టీఆర్ చిత్రానికి రుక్మిణి సైన్ చేసిందని అంటున్నారు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆమెకు ఓ కఠిన నిబంధన పెట్టాడట. ప్రాజెక్ట్ పూర్తి అయ్యే వరకు మరో మూవీ చేయడానికి వీల్లేదు అన్నారట. అందుకు కూడా ఆమె అంగీకారం తెలిపారని సమాచారం.

    రుక్మిణి నటించిన కన్నడ చిత్రం సప్త సాగరాలు దాటి తెలుగులో విడుదలైంది. రక్షిత్ శెట్టి హీరోగా విడుదలైన ఈ ఎమోషనల్ లవ్ డ్రామా పర్లేదు అనిపించుకుంది. రుక్మిణి నటనకు మార్కులు పడ్డాయి. అలాగే ఇటీవల విడుదలైన నిఖిల్ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీలో ఆమె నటించారు. ఈ మూవీని ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా విడుదల చేశారు. అసలు జనాలు పట్టించుకోలేదు.