Anant Ambani Pre Wedding: అంబాని ఇంట పెళ్లి వేడకలో దొంగల చేతివాటం!

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని విశాలమైన మైదానంలో అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుక జరిగింది. వేడుకలకు వచ్చిన కొందరు కారు అద్దాలు పగులగొట్టి ల్యాప్‌టాప్, నగదు చోరీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

Written By: Raj Shekar, Updated On : March 18, 2024 12:38 pm

Anant Ambani Pre Wedding

Follow us on

Anant Ambani Pre Wedding: అపర కుభేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ. ఇటీవలో ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుక ఇటీవల గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో జామ్‌జామ్‌గా నిర్వహించారు. దేశంలోపాటు విదేశాల నుంచి కూడా కూడా వీవీఐపీలు పెళ్లికి హాజరయ్యారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ వేడుకలో దొంగలు చేతివాటం చూసేందుకు యత్నించారు. అక్కడ కుదరకపోవడంతో పరిసర ప్రాంతాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. వారిని పోలీసులు పట్టుకున్నారు.

కారు అద్దాలు పగులగొట్టి..
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని విశాలమైన మైదానంలో అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుక జరిగింది. వేడుకలకు వచ్చిన కొందరు కారు అద్దాలు పగులగొట్టి ల్యాప్‌టాప్, నగదు చోరీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో పోలీసులు అక్కడున్న సీసీ కెమెరాలు పరిశీలించారు. దొంగలనుగుర్తించారు. వారి ఫొటోలను రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు పంపించారు.

ఢిల్లీలో పట్టివేత..
సీసీ ఫుటేజీలోని ఆనవాళ్ల ఆధారంగా ఢిల్లీలో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని దర్యాప్తు చేసి జగన్, దీపక్, గుణశేఖర్‌చ మురళి, ఏకాంబరంను అరెస్టు చేశారు. వీరంతా తిరుచ్చి రాంజీనగర్‌కు చెందినవారిగా గుర్తించారు.

పెళ్లిలో చేరీకి ప్లాన్‌..
అపర కుభేరుడు ముఖేష్‌ అంబానీ కుమారుడి పెళ్లిలోనే చోరీకి ఈ దొంగలు స్కెర్‌ వేశారు. ఇందుకోసం తిరుచ్చి నుంచి ఇక్కడకు వచ్చారు. అయితే అక్కడ పటిష్టమైన సెక్యూరిటీ ఉండడంతో దొంగతనానికి వీలు కాలేదు. ఇక ఉత్త చేతులతో వెళ్లడం ఎందుకనుకుని పెళ్లి వేడుక పరిసరాల్లోని కార్లలో చోరీలు చేశారు.

అదేదో సినిమాలో చెప్పినట్లు.. అంబానీ ఇంట్లో ఏదైనా ఒక ఖరీదైన వస్తువు దొరికినా చాలు తమ జీవితం సెట్‌ అయిపోతుందని ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది. కానీ, వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులకు పట్టుపడ్డారు.