https://oktelugu.com/

Bhola Shankar Trailer : భోళా శంకర్ ట్రైలర్ కి టైం ఫిక్స్… మెగాస్టార్ లేటెస్ట్ లుక్ చూశారా? 

భోళా శంకర్ విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇటీవల తమన్నాతో కూడిన రొమాంటిక్ డ్యూయట్ విడుదల చేశారు. కాగా ట్రైలర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. జులై 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Written By:
  • Shiva
  • , Updated On : July 23, 2023 / 01:56 PM IST
    Follow us on

    Bhola Shankar Trailer : బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బాక్సాఫీస్ ని హోరెత్తిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. కుర్ర హీరోలు కూడా ఆయనతో పోటీపడలేకున్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య నెలల వ్యవధిలో విడుదలయ్యాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య వసూళ్ల వర్షం కురిపించింది. రెండు వందలకు పైగా వసూళ్లతో సంక్రాంతి విన్నర్ అయ్యింది. వాల్తేరు వీరయ్య హిట్ జోషులో ఉన్న మెగాస్టార్ చకచకా భోళా శంకర్ పూర్తి చేశారు. ఆగస్టు 11న భోళా శంకర్ విడుదల కానుంది. 

     
    భోళా శంకర్ విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇటీవల తమన్నాతో కూడిన రొమాంటిక్ డ్యూయట్ విడుదల చేశారు. కాగా ట్రైలర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. జులై 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ట్రైలర్ విడుదల పోస్టర్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. చేతిలో కత్తితో శత్రువుల వైపు దూసుకెళుతున్న చిరంజీవి చాలా ఫెరోషియస్ గా ఉన్నారు. భోళా శంకర్ మూవీలో చిరంజీవి లుక్ బాగా కుదిరింది. ఈ మధ్య కాలంలో ఈ మూవీలో ఆయన ఇంత యంగ్ అండ్ హ్యాండ్సమ్ గా కనిపించలేదు. 
     
    అంటే మరో నాలుగు రోజుల్లో భోళా శంకర్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేయనుంది. భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ నుండి వస్తున్న చిత్రం ఇది. తమన్నా చిరంజీవికి జంటగా నటిస్తున్నారు. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్ర చేయడం విశేషం. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. 
     

    ఇటీవల యూఎస్ వెకేషన్ కి వెళ్లిన చిరంజీవి తిరిగి వచ్చారు. త్వరలో ఆయన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఈ చిత్ర నిర్మాత. ఈ మూవీ మలయాళం రీమేక్ బ్రో డాడీ రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది. ఓ యంగ్ హీరోకి కీలక రోల్ ఉన్న నేపథ్యంలో డీజే టిల్లు ఫేమ్  సిద్ధుని అనుకున్నారట. అయితే సిద్ధు సుముఖంగా లేరనే ప్రచారం జరుగుతుంది. దీంతో మరో యంగ్ హీరో కోసం ప్రయత్నం చేస్తున్నారట. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.