Tiger Nageswara Rao Twitter Talk: హీరో రవితేజ ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో ఆయన నటించారు. యంగ్ డైరెక్టర్ వంశీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కించాడు. బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించింది. రేణూ దేశాయ్ రెండు దశాబ్దాల అనంతరం ఓ కీలక పాత్రలో కనిపించనుంది. నాజర్, అనుపమ్ ఖేర్, జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ ఇతర కీలక రోల్స్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు మరింత పెరిగాయి.
టైగర్ నాగేశ్వరరావు దసరా కానుకగా అక్టోబర్ 20న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేశారు. యూఎస్ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు 70ల నాటి గజదొంగ కథ. ఆంధ్రప్రదేశ్, స్టూవర్టుపురం అనే చిన్న గ్రామంలో పుట్టిన పేద కుర్రాడు దొంగగా మారతాడు. దేశాన్ని, ప్రభుత్వాలను గడగడలాడించే స్థాయికి ఎదుగుతాడు. పెద్దలను దోచి పేదలకు పంచి ఇండియన్ రాబిన్ హుడ్ గా అవతరిస్తాడు.
టైగర్ నాగేశ్వరరావు నిజజీవిత కథకు కొంత ఫిక్షన్ జోడించి టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కించారు. ఇక సినిమా ఎలా ఉందంటే… ఆరంభం అదిరిపోయింది. టైగర్ నాగేశ్వరరావుగా రవితేజను పరిచయం చేసిన తీరు గూస్ బంప్స్ కలిగిస్తుంది. టైగర్ నాగేశ్వరరావు బాల్యం, దొంగగా మారడానికి దారి తీసిన పరిస్థితులను తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ యాక్షన్ సీన్స్, దోపిడీ సన్నివేశాలతో ఆసక్తికరంగా మలిచారు.
ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. ప్రేక్షకులకు మంచి అనుభూతి పంచుతుంది. అయితే సెకండ్ హాఫ్ నిడివి కారణంగా సాగదీసిన భావన కలుగుతుంది. ఈ చిత్ర నిడివి దాదాపు మూడు గంటలు. క్లైమాక్స్ కి ముందు వరకు వచ్చే సన్నివేశాలు లెంగ్త్ అనిపిస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. ఉన్నత నిర్మాణ విలువలతో సినిమా కూడి ఉంది. విఎఫ్ఎక్స్ పర్లేదు. మ్యూజిక్ కి పాస్ మార్స్క్ పడతాయి.
డార్క్ రోల్ లో రవితేజ ఒదిగిపోయాడు. దొంగగా ఆయన మేనరిజమ్స్, మాస్ ఎలివేషన్స్ సినిమాకు హైలెట్. హీరోయిన్ నుపుర్ సనన్ తో కెమిస్ట్రీ బాగుంది. సామాజిక కార్యకర్తగా రేణూ దేశాయ్ ఆకట్టుకున్నారు. మొత్తంగా టైగర్ నాగేశ్వరరావు పీరియాడిక్ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్. రవితేజ ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడిని అలరించే చిత్రం. సెకండాఫ్ పై దర్శకుడు ఇంకొంచెం దృష్టి పెట్టి ఉంటే ఫలితం ఇంకా మెరుగ్గా ఉండేది.
https://twitter.com/venkyreviews/status/1715174685233541299
https://twitter.com/cprnewstelugu/status/1715188770868273543
#TigerNageswaraRao – 3.25/5 SuperHit ❤️
Positives:
👉#RaviTeja Performance
👉Good First Half
👉Fight Sequences
👉Production Values
👉 @gvprakash BGM Back Bone Of The Movie 🔥Negatives:
👉Lengthy Runtime@RaviTeja_offl@AbhishekOfficl #RenuDesai pic.twitter.com/EJO9ZdBdk5— Gayle 333 (@RajeshGayle117) October 20, 2023
https://twitter.com/allu_sujan/status/1715186258585247796