https://oktelugu.com/

Tiger Nageswara Rao First Look Review: టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ రివ్యూ: ఇది పులిని వేటాడే పులి… గజదొంగగా రవితేజ కేక!

టైగర్ నాగేశ్వరరావు మూవీ థీమ్ తెలియజేసేలా ఫస్ట్ లుక్ తో పాటు కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. 70వ దశకంలో స్టూవర్టుపురం అనే గ్రామం అంటే జనాలకు ఎంత భయమో..

Written By:
  • Shiva
  • , Updated On : May 24, 2023 / 05:16 PM IST

    Tiger Nageswara Rao First Look Review

    Follow us on

    Tiger Nageswara Rao First Look Review: మాస్ మహారాజ్ క్రేజీ బయోపిక్ ఎంచుకున్నారు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావుగా ఆయన నటిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. దీంతో ప్రొమోషన్స్ షురూ చేశారు. నేడు అట్టహాసంగా టైగర్ నాగేశ్వరరావు చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దొంగగా రవితేజ కళ్ళు భయపెడుతున్నాయి. ఆయన చూపులోని తీవ్రత గూస్ బంప్స్ కలిగిస్తుంది. రవితేజ క్లోజప్ షాట్ అద్భుతంగా ఉంది. టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ అదిరింది.

    టైగర్ నాగేశ్వరరావు మూవీ థీమ్ తెలియజేసేలా ఫస్ట్ లుక్ తో పాటు కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. 70వ దశకంలో స్టూవర్టుపురం అనే గ్రామం అంటే జనాలకు ఎంత భయమో… ఆ భయానికి కారణం ఏమిటో తెలియజేశారు. విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ కి అద్భుతమైన విజువల్స్ తోడు కావడంతో ప్రోమో బాగా ఎలివేట్ అయ్యింది. టీజర్ చివర్లో రవితేజ ‘జింకల్ని వేటాడే పులిని చూసి ఉంటావ్ పులిని వేటాడే పులిని చూశావా’ అని చెప్పడం అదిరిపోయింది. టైగర్ నాగేశ్వరావుతో రవితేజ భారీ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

    మిగతా భాషల్లో పలువురు స్టార్స్ టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ ప్రోమోకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. తమిళంలో కార్తీ, మలయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో శివరాజ్ కుమార్ ఇక హిందీలో జాన్ అబ్రహం వాయిస్ ఓవర్ చెప్పారు. టైగర్ నాగేశ్వరరావు జీవితం యూనివర్సల్ సబ్జెక్టు. ఇండియన్ రాబిన్ హుడ్ గా ఆయన పేరుగాంచారు. పెద్దలను దోచి పేదలకు ఆయన పంచాడు. సూపర్ హీరో సబ్జెక్టు అనవచ్చు. కాబట్టి ఇతర భాషల్లో ఆదరణ దక్కించుకునే అవకాశం కలదు . మొత్తంగా ప్రోమో అంచనాలు పెంచేసింది.

    టైగర్ నాగేశ్వరరావు మూవీలో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రేణు దేశాయ్ ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. రేణు కీలక రోల్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా జీవీ ప్రకాష్ పని చేశారు. ప్రోమోకి ఆయన ఇచ్చిన బీజీఎమ్ గొప్పగా ఉంది. సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. దసరా కానుకగా అక్టోబర్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. రవితేజకు టైగర్ నాగేశ్వరరావు మెమరబుల్ మూవీ అయ్యే అవకాశం కలదు. ఆయన ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారని సమాచారం.