Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan - Swarupanandendra Swamy : ఆ గురువును అందుకే దూరం పెట్టిన జగన్

CM Jagan – Swarupanandendra Swamy : ఆ గురువును అందుకే దూరం పెట్టిన జగన్

CM Jagan – Swarupanandendra Swamy : గత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయానికి అనేక కారణాలున్నాయి. ఒక్క చాన్స్ ప్లీజ్ అన్న స్లోగన్, అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకత, ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు, కష్టాల్లో ఉన్న అన్నివర్గాలకు ఇచ్చిన హామీలు.. ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల కారణాలు జగన్ కు విజయాన్ని కట్టబెట్టాయి. అయితే ఇవన్నిటితో పాటు నేను చేసిన రాజశ్యామల యాగమే జగన్ గెలుపునకు ప్రధాన కారణమని విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర చెబుతున్నారుట. అక్కడితే ఆయన ఆగడం లేదు. అయినదానికి కానిదానికి దేవస్థానం అధికారులతో పాటు దేవాదాయ శాఖకు ఇబ్బందులు పెడుతున్నారుట. ఒకానొక దశలో ప్రభుత్వంపై విమర్శలకు వెనుకడుగు వేయడం లేదట. దీంతో ఈ స్వామిజీకి కాస్తా దూరం పెట్టండని ఆదేశాలొచ్చాయట.

ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ గురువు ఎవరంటే చటుక్కున  స్వరూపానందేంద్ర స్వామి గుర్తుకొస్తారు. విశాఖలో ఉన్న శ్రీ శారదాపీఠం అంటే ఉభయ రాష్ట్రాల అధికార పార్టీ ప్రజాప్రతినిధఉలు, నేతలకు  చాలా ఇష్టమైన కేంద్రంగా మారిపోయింది. జగన్ ప్రభుత్వాన్ని మనసారా స్వామి దీవిస్తారని.. అలాగే స్వామిని రాజ గురువుగా వైసీపీ పెద్దలు ప్రేమిస్తారని అంతా భావిస్తారు. స్వామి కోసం పీఠానికి అనేక సార్లు సీఎం హోదాలో జగన్ వచ్చారు. స్వామి అంటే వైసీపీ మొత్తానికి మొత్తం భక్తి ప్రపత్తులు ఎక్కువని చెబుతూంటారు. స్వామి చుట్టూ వైసీపీ ఆశావహులు చేరి ఆయన ద్వారా తమ కోరికలను పై వారికి చెప్పుకుని తీర్చుకుంటారని ఒక టాక్ కూడా ఉంది.

అయితే అంతటి చనువును స్వామిజీ చాలా ఎక్కువగా ఊహించుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. అందుకనే ప్రభుత్వ పెద్దలు గ్యాప్ పెంచినట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది మొదట్లో శ్రీ శారదా పీఠం లో జరిగిన వార్షిక యాగానికి జగన్ హాజరు కలేదు. గత నెలలో సింహాచలంలో జరిగిన చందనోత్సవం సందర్భంగా స్వామీజీ ప్రభుత్వం మీద విమర్శలు ఒక స్థాయిలో చేశారు. దాని మీద ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు.స్వామీజీ తాను చేసిన రాజశ్యామల యాగం వల్లనే జగన్ సీఎం అయ్యారని చెప్పుకోవడం… తానే వైసీపీ ప్రభుత్వానికి ఆధ్యాత్మిక గురువుని అని ప్రచారం చేసుకోవడం వంటి అతి విషయాలే  పెద్దలతో గ్యాపునకు కారణంగా తెలుస్తోంది.

తొలుత ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మొదలుపెట్టిన స్వామిజీ.. రాజకీయ సిఫారసులు.. కొందరు పదవులు, కొలువుల కోసం ఒత్తిడి చేయడంతో సర్కారులో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని తెలుస్తోంది. ఎందుకొచ్చింది గొడవ స్వామిజీని పక్కకు చేర్చకుంటే భవిష్యత్ లో ఇబ్బందులు వస్తాయని కాస్తా దూరం పెట్టినట్టు సమాచారం. ఇటీవల విజయవాడలో జరిగిన మహా చండీయాగం సహిత రాజశ్యామల యాగానికి స్వామిని చాలా వరకూ దూరం పెట్టారని అంటున్నారు. ఆరు రోజుల పాటు ఈ యాగం జరిగితే కేవలం చివరి రోజున మాత్రమే స్వామి హాజరయ్యారు.ఇవన్నీ చూసిన వారు ఎక్కడో వ్యవహారం కాస్తా చెడింది అని అంటున్నారు. స్వాములు భౌతిక ప్రపంచానికి అతీతంగా ఆధ్యాత్మిక చింతనలో ఉండాలని, రాజకీయాల్లో వేలు పెడితే ఇలాగే వైభవాలు ప్రాభవాలు మూన్నాళ్ల ముచ్చట్టగానే ముగుస్తాయన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version