https://oktelugu.com/

Game Changer Movie : గేమ్ చేంజర్’ చిత్రంలో శ్రీకాంత్ పాత్రని మిస్ చేసుకున్న సీనియర్ హీరో ఎవరో తెలుసా..? దురదృష్టం అంటే అతనిదే!

టీజర్ లో సీనియర్ హీరో శ్రీకాంత్ లుక్ ని చూసిన ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేంత పని అయ్యింది. చాక్లెట్ బాయ్ గా, ఎంతో క్యూట్ గా కనిపించే శ్రీకాంత్ ఇలా బట్ట తల వేసుకొని కనిపించడం ఇదే తొలిసారి. అనేక ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన గతంలో ఈ సినిమాలోని తన గెటప్ గురించి చెప్పుకొచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 11, 2024 / 07:50 PM IST

    Game Changer Movie

    Follow us on

    Game Changer Movie :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై అభిమానుల నుండి, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వింటేజ్ శంకర్ కమర్షియల్ సినిమాలు ఎలా ఉంటాయో, ‘గేమ్ చేంజర్’ కూడా అలాంటి సినిమా లాగా అనిపిస్తుంది అంటూ ఈ టీజర్ ని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్నారు. కేవలం ఒక్క రోజులోనే ఈ టీజర్ కి 70 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయంటే, ఈ టీజర్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మీరే అర్థం చేసుకోండి. అయితే ఈ టీజర్ లో రామ్ చరణ్ మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసాడు. రంగస్థలం, #RRR తర్వాత రామ్ చరణ్ కి ‘గేమ్ చేంజర్’ చిత్రం అద్భుతమైన నటన కనబర్చేందుకు వేదికగా నిలుస్తుందని ఈ టీజర్ లో ఆయన వేరియేషన్స్ చూస్తేనే అర్థం అవుతుంది.

    రామ్ చరణ్ గెటప్స్ గురించి కాసేపు పక్కన పెడితే, ఈ టీజర్ లో సీనియర్ హీరో శ్రీకాంత్ లుక్ ని చూసిన ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేంత పని అయ్యింది. చాక్లెట్ బాయ్ గా, ఎంతో క్యూట్ గా కనిపించే శ్రీకాంత్ ఇలా బట్ట తల వేసుకొని కనిపించడం ఇదే తొలిసారి. అనేక ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన గతంలో ఈ సినిమాలోని తన గెటప్ గురించి చెప్పుకొచ్చాడు. నన్ను చూస్తే ఆడియన్స్ షాక్ కి గురి అవుతారు అని చెప్పుకొచ్చాడు.
    చివరికి టీజర్ ని చూస్తే ఆయన చెప్పిన దానికి మించే ఉంది. అయితే ఈ క్యారక్టర్ కోసం ముందుగా శ్రీకాంత్ ని అనుకోలేదట. నిర్మాత దిల్ రాజు మదిలో జగపతి బాబు మాత్రమే ఉన్నాడు. ఈ విషయాన్ని శంకర్ కి చెప్పగా, ఈ గెటప్ జగపతి బాబు కి సూట్ అవ్వదు, శ్రీకాంత్ ని తీసుకుందాం అని చెప్పి, శ్రీకాంత్ ని ఖరారు చేశాడట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

    అయితే జగపతి బాబు కి ఇది దురదృష్టం అనే చెప్పాలి. ఇంత క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం మిస్ అయితే ఎవరికి మాత్రం బాధ ఉండదు చెప్పండి. ఇది ఇలా ఉండగా ‘గేమ్ చేంజర్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్, చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేలా చేస్తున్నాయి. ముఖ్యంగా టీజర్ తర్వాత అయితే బయ్యర్స్ ఫ్యాన్సీ రేట్స్ కి దిల్ రాజు ఎంత అడిగితే అంత ఇచ్చేసి ప్రాంతాల వారీగా హక్కులను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారట. ఇదే నెలలో ఈ సినిమాకి సంబంధించిన డ్యూయెట్ సాంగ్ విడుదల కానుంది. ఈ సాంగ్ కోసం ఏకంగా 20 కోట్ల రూపాయిలు ఖర్చు చేశారట.