https://oktelugu.com/

Daku Maharaju : డాకు మహారాజు సినిమాలో ముగ్గురు యంగ్ హీరోలు .. బాలయ్యతో దద్దరిలాల్సిందేనట…

సినిమా ఇండస్ట్రీ చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా మార్చుకోవాలనే ప్రయత్నమైతే చేస్తుంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 11, 2024 / 08:32 AM IST

    balayya babu

    Follow us on

    Daku Maharaju : సినిమా ఇండస్ట్రీ చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా మార్చుకోవాలనే ప్రయత్నమైతే చేస్తుంటారు. ఇక దర్శకుడు కూడా చాలా వరకు కొత్తదనాన్ని చూపిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబి లాంటి దర్శకుడు కూడా బాలయ్య బాబు తో చేస్తున్న డాకు మహరాజ్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…
    తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక ఇప్పటికే వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ లను అందుకొని హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన ఆయన తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో చేస్తున్న ‘డాకు మహారాజ్’ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే విధంగా చూసుకుంటున్నాడు. ఇక డాకు మహారాజు నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులందరిని అలరించడమే కాకుండా బాలయ్య బాబు ఈసారి చాలా కొత్తగా ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దాంతోపాటుగా ఈ సినిమాలో భారీ క్యామియో లను దింపుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. యంగ్ హీరోలు అయిన నవీన్ పోలిశెట్టి, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లాంటి ముగ్గురు హీరోలతో ఈ సినిమాలో కామియో రోల్స్ చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు ఏ సమయంలో ఈ సినిమాలో ఎంట్రీ ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది.
    ఇక వీళ్ళ క్యామియో లకు అదిరిపోయే మ్యూజిక్ ని కొట్టడానికి తమన్ బిజీయం ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు సినిమాలో క్యామియో రోల్ పోషించడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే బాలయ్య బాబు స్క్రీన్ మొత్తాన్ని తినేస్తూ ఉంటాడు. మరి అలాంటి వ్యక్తి పక్కన నిలబడి ఒక నటించాలి అంటే యంగ్ హీరోలకు కత్తి మీద సాము లాంటిందనే చెప్పాలి.
    కొంచెం అటు ఇటు అయినా కూడా బాలయ్య బాబు వాళ్ళను  డామినేట్ చేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ ముగ్గురికి బాలయ్య బాబుతో కాంబినేషన్ ఉంటుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డ రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలో క్యామియో రోల్ ను పోషించాడు.
    ఇక దాంతో అతనికి ఇండస్ట్రీ లో మంచి పేరు అయితే వచ్చింది. ఇక సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఆయనకు ప్రేక్షకుల్లో పెద్దగా గుర్తింపైతే రాలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన క్యామియో అదిరిపోతుందని చెబుతున్నారు…