https://oktelugu.com/

Mahesh Movie  : మహేష్ బాబు సినిమాలో విలన్ గా నటిస్తున్న ముగ్గురు స్టార్ హీరోలు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరు క్రియేట్ చేయలేని పెను ప్రభంజనాలను సృష్టించిన ఏకైక దర్శకుడు రాజమౌళి... ఆయనతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న టాప్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు అంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు... ఇక ఆయన చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 10, 2024 / 07:10 PM IST

    Mahesh Movie 

    Follow us on

    Mahesh Movie  : రాజమౌళి లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో తన పేరు మారుమ్రోగి పోవడమే కాకుండా వరల్డ్ లో ఉన్న గొప్ప దర్శకులందరు అతన్ని పొగుడుతారు అంటూ తన సన్నిహితులు సైతం చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. అయితే మహేష్ బాబుతో చేయబోయే సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళనప్పటికి కొన్ని సెలెక్టెడ్ లొకేషన్స్ ను సెలెక్ట్ చేసి మరి రాజమౌళి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధించి పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రాజమౌళి కూడా ఇప్పటివరకు బాహుబలి 2 తో ఇండస్ట్రీ హిట్ ని అందించాడు. కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోనే ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రాజమౌళి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు విలన్స్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాజమౌళి చేసే బిజినెస్ స్ట్రాటజీ కూడా చాలా వైల్డ్ గా ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇలా బిజినెస్ ను దృష్టిలో ఉంచుకొని ఇందులోకి కావాల్సిన ముగ్గురు విలన్స్ కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయనకి మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి పృధ్విరాజ్ సుకుమారన్ కనిపించాడు.

    అలాగే తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి శివ కార్తికేయన్ ఇక బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహం లాంటి హీరోలను ఈ సినిమాల్లో విలన్స్ గా చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వీళ్ళు ముగ్గురు సినిమాలో ఉండటం వల్ల సినిమా ఇండియాలో భారీగా వర్కౌట్ అవుతుంది.

    అలాగే హాలీవుడ్ సినిమా మేకర్స్ ని పెద్దగా తీసుకొనప్పటికి కంటెంట్ పరంగా హాలీవుడ్ లో కూడా ఈ సినిమా మెప్పిస్తుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమాలో ఇండియాలో ఉన్న టాప్ స్టార్స్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఇదిలా ఉంటే తనకంటూ భారీ సక్సెస్ ని సంపాదించుకుంటేనే రాజమౌళి పాన్ వరల్డ్ లో కూడా నిలబడగలుగుతాడు.