https://oktelugu.com/

Director Shankar : గేమ్ చేంజర్ సినిమాతో సక్సెస్ సాధిస్తే శంకర్ టాప్ డైరెక్టర్ అవుతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ లాంటి హీరో మాస్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఈయన ప్రస్తుతం తన కెరియర్ లో ఇప్పటి వరకు రానంత భారీ బడ్జెట్ తో శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా వస్తుంది. ఈ సినిమాతో తను ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. కానీ ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించి రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిరుస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 10, 2024 / 06:40 PM IST

    Director Shankar

    Follow us on

    Director Shankar :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సమయంలో గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తోంది అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి కూడా చాలావరకు హెల్ప్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక శంకర్ ఈ సినిమాని చాలా వైల్డ్ గా తెరకెక్కించినట్టుగా కూడా టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది.

    అలాగే రామ్ చరణ్ తన పాత్ర పరిధి మేరకు సూపర్ గా నటించినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరో నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. ఇక ఈ సినిమా సక్సెస్ అనేది రామ్ చరణ్ కంటే కూడా శంకర్ కే చాలా కీలకంగా మారిబోతుంది.

    ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన భారీ సక్సెస్ ని అందుకుంటే మాత్రం తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తారనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే శంకర్ పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక తనదైన రీతిలో సినిమాలు చేస్తున్న ఈ దర్శకుడు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా అది ఆయన కెరియర్ కి ఎలా ఉపయోగపడుతుందనే విషయాల్లో కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది… చూడాలి మరి ఈ సినిమాతో అటు రాంచరణ్ కి ఇది శంకర కి ఎలాంటి సక్సెస్ దక్కుతుంది అనేది…