https://oktelugu.com/

Comedian Satya : కమెడియన్ ‘సత్య’ కూతుర్ని చూసారా..ఇంత క్యూట్ గా ఉందేంటి..ఆమె డ్యాన్స్ చూస్తే మెంటలెక్కిపోతారు!

రీసెంట్ గా సత్య అనే కమెడియన్ వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ కూడా దాటిపోయాడు. వెన్నెల కిషోర్ కామెడీ పండాలంటే ఆయన కచ్చితంగా నటించాలేమో, కానీ సత్య ముఖాన్ని చూస్తేనే నవ్వు వచేస్తాది. భగవంతుడు ఇలాంటి అదృష్టం మన టాలీవుడ్ లో బ్రహ్మానందం, సునీల్ కి మాత్రమే ఇచ్చాడు. ఇప్పడు ఆ జాబితాలోకి సత్య కూడా చేరిపోయాడు

Written By:
  • Vicky
  • , Updated On : November 10, 2024 / 07:40 PM IST

    Comedian Satya

    Follow us on

    Comedian Satya : Comedian Satya : సినీ ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ గా ఎదగాలంటే టాలెంట్ తో పాటు కొండంత అదృష్టం కూడా ఉండాలని అందరూ అంటూ ఉంటారు. ఇవి రెండు కలిసొచ్చిన నటులకు తిరుగు ఉండదు. అలాంటి నటుల జాబితాలో ఇప్పుడు కమెడియన్ సత్య చేరిపోయాడు. బ్రహ్మానందం సినిమాల సంఖ్య బాగా తగ్గించడం, సునీల్ కామెడీ రోల్స్ కి బాగా దూరం అవ్వడంతో టాలీవుడ్ లో కమెడియన్స్ కొరత ఏర్పడింది. ఆ గ్యాప్ లో వచ్చిన వెన్నెల కిషోర్ బాగా షైన్ అయ్యాడు. కంటెంట్ లేని సన్నివేశాలకు కూడా తన కామెడీ టైమింగ్ తో నవ్వు రప్పించగల టాలెంట్ వెన్నెల కిషోర్ లో ఉంది. ఇప్పుడు రీసెంట్ గా సత్య అనే కమెడియన్ వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ కూడా దాటిపోయాడు. వెన్నెల కిషోర్ కామెడీ పండాలంటే ఆయన కచ్చితంగా నటించాలేమో, కానీ సత్య ముఖాన్ని చూస్తేనే నవ్వు వచేస్తాది. భగవంతుడు ఇలాంటి అదృష్టం మన టాలీవుడ్ లో బ్రహ్మానందం, సునీల్ కి మాత్రమే ఇచ్చాడు. ఇప్పడు ఆ జాబితాలోకి సత్య కూడా చేరిపోయాడు.

    సత్య 2009 వ సంవత్సరంలో నితిన్ హీరో గా నటించిన ‘ద్రోణ’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసాడు. ఆ సినిమా నుండి ఆయనకి అన్ని చిన్న చిన్న పాత్రలే లభించాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న సత్య కి ‘రంగస్థలం’ చిత్రం తో మంచి బ్రేక్ దొరికింది. ఇక అక్కడి నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా క్రేజీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోయాడు. ఇక రీసెంట్ సమయాల్లో అయితే కొన్ని సినిమాలు కేవలం సత్య కామెడీ టైమింగ్ ని నమ్ముకొని తెరకెక్కుతున్నాయి. ‘మత్తు వదలరా 2’ చిత్రంలో ఆయన టైమింగ్ కి ప్రేక్షకుల పొట్టలు చెక్కలు అయ్యాయి. ఫలితంగా ఆ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. పేరుకి ఈ సినిమాలో హీరో శ్రీ సింహా కానీ, సక్సెస్ క్రెడిట్స్ మొత్తం సత్య ఖాతాలోకి వెళ్లాయి.

    ప్రస్తుతం సత్య చేతుల్లో 10 సినిమాలు ఉన్నాయి. అందులో ప్రభాస్ ‘రాజా సాబ్’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లతో పాటు మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. అంతే కాదు సత్య ని హీరో గా పెట్టి సినిమాలు కూడా తీయాలని ప్రముఖ నిర్మాతలు అనుకుంటున్నారట, కానీ సత్య అందుకు ఒప్పుకోవడం లేదు. ఇది ఇలా ఉండగా సత్య తన కూతురుతో సరదాగా డ్యాన్స్ వేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చూసేందుకు ఎంతో క్యూట్ గా ఉన్న ఈ పాపకి సంబంధించిన ఈ వీడియో మూడు సంవత్సరాల క్రితం వచ్చిందట. కానీ ఇన్నాళ్లకు సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ దీనిని గుర్తు చేసుకుంటూ పోస్టులు వేయడంతో బాగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియా లో ఊపేస్తున్న ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.