Nag Ashwin : నాగ్ అశ్విన్ యూనివర్స్ లో ఈ స్టార్ హీరోలు భాగం కాబోతున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోలు తమను తాము స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడున్న దర్శకులైతే వాళ్ళు చేసే ప్రతి సినిమాతో కూడా స్టార్ స్టేటస్ ని అందుకోవడానికి భారీ సక్సెస్ లను అందుకోవడానికి రెఢీ అవుతున్నారు...

Written By: Gopi, Updated On : October 21, 2024 2:40 pm

Nag Ashwin

Follow us on

Nag Ashwin : ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మంచి కథలతో సినిమాలు రావడం మొదలయ్యాయి. రాజమౌళి బాహుబలి సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. ఇక అప్పటినుంచి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కటైపోయింది. ఏ భాషలో సినిమా వచ్చినా కూడా మిగతా లాంగ్వేజ్ ల్లో ఉన్న ప్రేక్షకులందరూ ఆ మూవీస్ ను చూసి అవి బాగుంటే ఆదరిస్తున్నారు. నిజానికి ఇదొక శుభ పరిణామం అనే చెప్పాలి. దీనివల్ల సినిమాల్లో ది బెస్ట్ క్వాలిటీ సినిమాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఆ సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలిపేందుకు దర్శకులు పడే కష్టం కూడా కనిపిస్తూ ఉంటుంది. అందువల్లే తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి ఇప్పుడు ఉన్న దర్శకులందరు పోటీ పడుతున్నారు. నిజానికి నాగ్ అశ్విన్ లాంటి దర్శకుడు కూడా తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సక్సెస్ ను సాధించాలంటే మాత్రం నాగ్ అశ్విన్ చాలా వరకు కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. అంటూ సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక కల్కి సినిమాతో ఒకసారిగా ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. దాదాపు 1000కోట్లకు పైన కలెక్షన్లు కాబట్టి కల్కి సినిమాను బ్లాక్ బాస్టర్ గా నిలిపాడు.

ఈ సినిమాతో కూడా మరోసారి ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈయనతో పాటు ఈయన యూనివర్స్ లో నటించడానికి ముగ్గురు స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాగా, మరొకరు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, ఇంకొకరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న రామ్ చరణ్ కావడం విశేషం…

ఇక వీళ్ళ ముగ్గురితో ఆయన తదుపరి సినిమాలను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే సినిమాలో నటిస్తారా? లేదంటే ఆయన్ చేసే యూనివర్స్ లో వీళ్ళను భాగం చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సక్సెస్ లను సాధించాలంటే మాత్రం భారీ ప్రణాళికలను రూపొందించుకోవాలి.

ఈ ముగ్గురు ఇమేజ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ ని రాసుకొని దానికి సంబంధించిన ప్రణాళికలను పూర్తి చేసుకున్న తర్వాతే ఆయన రంగంలోకి దిగితే సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది. లేకపోతే మాత్రం సినిమా డిజాస్టర్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో తనకున్న ఇమేజ్ కూడా పడిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…