Jagan’s flirtation with YS Sharmila: వైఎస్ షర్మిలతో జగన్ లాలూచీ నిజమా? అసలు తెరవెనుక ఏం జరుగుతోంది?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శత్రువులూ ఉండరు అనేది వాస్తవం. అందులోనూ ఒకే ఫ్యామిలీ నుంచి వేర్వేరు పార్టీలో ఉన్న నేతలూ ఉన్నారు. సరే.. ఎన్నికల సమయంలో వారంతా పోటాపోటీగా ఆరోపణలు చేసుకున్నప్పటికీ ఆ తరువాత కుటుంబ బంధాలకు విలువనివ్వక తప్పదు. అయితే.. ఇప్పుడు రాజకీయాల్లో వైఎస్ జగన్, షర్మిలల వైఖరి తీవ్ర చర్చకు దారితీసింది. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి షర్మిలను పక్కన పెడుతూ వచ్చారనేది అందరికీ తెలిసిన అంశమే

Written By: Srinivas, Updated On : October 21, 2024 2:41 pm

Jagan's flirtation with YS Sharmila

Follow us on

Jagan’s flirtation with YS Sharmila: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శత్రువులూ ఉండరు అనేది వాస్తవం. అందులోనూ ఒకే ఫ్యామిలీ నుంచి వేర్వేరు పార్టీలో ఉన్న నేతలూ ఉన్నారు. సరే.. ఎన్నికల సమయంలో వారంతా పోటాపోటీగా ఆరోపణలు చేసుకున్నప్పటికీ ఆ తరువాత కుటుంబ బంధాలకు విలువనివ్వక తప్పదు. అయితే.. ఇప్పుడు రాజకీయాల్లో వైఎస్ జగన్, షర్మిలల వైఖరి తీవ్ర చర్చకు దారితీసింది. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి షర్మిలను పక్కన పెడుతూ వచ్చారనేది అందరికీ తెలిసిన అంశమే. దాంతో షర్మిల కూడా అప్పటి నుంచి అన్నయ్య జగన్‌కు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఆ తరువాత వైఎస్సార్ తెలంగాణ పార్టీ అంటూ ఆమె కొత్త పార్టీని స్థాపించారు.

ఇక అప్పటి నుంచి షర్మిల తెలంగాణ రాజకీయాలకే పరిమితం అయ్యారు. ఇక్కడ ఆమెకు, ఆమె పార్టీకి అనుకున్న స్థాయిలో హైప్ రాలేదు. పలు సమస్యలపై ధర్నాలు చేపట్టినా.. నిరసనలు చేసినా పెద్దగా పార్టీ క్లిక్ కాలేదు. ఈ క్రమంలో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల సమయంలో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దాంతో అప్పటి నుంచి ఆమెకు తెలంగాణ రాజకీయాల్లోనూ కీలక పొజిషన్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ.. చివరకు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఇక అప్పటి నుంచి ఆమె తెలంగాణను వదిలి ఏపీకి షిఫ్ట్ అయిపోయారు.

జగన్, షర్మిలల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత కోపం వారిది. కానీ.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ సంచలన వార్త హల్‌చల్ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయిన ఆ వార్తతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయన్న చర్చనే నడుస్తున్నది. ఇంతకీ ఆ వార్త సారాంశం ఏంటంటే.. అన్నా, చెల్లెళ్లు ఇక నుంచి కొట్లాటలకు పోకుండా.. రాజీకి వచ్చారని. కొద్దిరోజులుగా బెంగళూరు కేంద్రంగా జరుగుతున్న రాజీ చర్చలు కొలిక్కి వచ్చాయట. పార్టీకి షర్మిల పరంగా జరిగిన నష్టాన్ని తెలుసుకున్న జగన్.. ఇప్పుడు ఆమె సపోర్టు కోరినట్లుగా సమాచారం. దీంతో ఇప్పుడు రాజకీయంగా ఇద్దరు కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న చర్చ ఉత్కంఠగా మారింది.

గత ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి షర్మిల కూడా ఓ కారణమే. షర్మిల పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్న జగన్‌పై బాణాలు గురిపెట్టారు. ఈ ఎన్నికల్లో జగన్‌ను ఓడించడమే తమ లక్ష్యమంటూ చెప్పుకొచ్చారు. ఆ స్థాయిలోనే ప్రచారం సాగించారు. కూటమిని మించి జగన్‌పై ఆరోపణలు చేశారు. దాంతో జగన్ కూడా ఘోర ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పార్టీని ప్రక్షాళన చేసే కార్యక్రమంలో జగన్ మునిగిపోయారు. అందులోభాగంగానే షర్మిలతో వైరుధ్యం కంటే రాజీతోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రెండు కుటుంబాలకు అత్యంత సన్నిహితంగా ఉండే ఇద్దరు పెద్దలు రంగంలోకి దిగారు. బెంగళూరు కేంద్రంగా కొద్ది రోజులుగా ఈ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చర్చలు కొలిక్కివచ్చాయన్న టాక్ నడుస్తోంది. ప్రధానంగా ఈ చర్చల్లో ఆస్తుల వాటా అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. షర్మిల కోరిన విధంగా ఆస్తిలో వాటాలు పంచుకోవాలని నిర్ణయించారని ఆ కథనం సారాంశం. అయితే.. మరోవైపు ఇంకో టాక్ కూడా నడుస్తోంది. తాను కష్టపడి సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల్లో షర్మిలకు ఎందుకు వాటా ఇస్తారన్న చర్చ నడుస్తోంది. ఇంత అవసరం ఉన్నదంటే ఏదైనా సహాయం చేయడానికి వస్తాడు కానీ.. ఆస్తిలో వాటా ఇస్తాడా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే షర్మిల పార్టీ నుంచి వెళ్లిపోయారు. తన తల్లి విజయను కూడా తీసుకెళ్లారు. దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజీ జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ పార్టీని కాపాడుకునేందుకు అని చెప్తున్నట్లుగా ఆయన ఈ సాహసానికి దిగుతారా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి