https://oktelugu.com/

Photo Story: ఉదయ్ కిరణ్ పక్కన ఉన్న ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో..ఎవరో గుర్తుపట్టగలరా?

ఉదయ్ కిరణ్ హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలోని 'తూనీగ..తూనీగ' అనే పాట పెద్ద హిట్. ఇప్పటికీ కూడా ఈ పాటని మనం అనేక సందర్భాలలో వింటూనే ఉంటాం.

Written By:
  • Vicky
  • , Updated On : October 21, 2024 / 02:33 PM IST

    Photo Story(7)

    Follow us on

    Photo Story: టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ,వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్స్ గా నటించిన ఎంతో మంది నేడు ఇండస్ట్రీ లో హీరోలు గా మారి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తేజ సజ్జ చూస్తూ ఉండగానే పాన్ ఇండియన్ హీరో గా ఎదిగిపోవడం మనమంతా గమనించాము. ఆయన హీరో గా నటించిన ‘హనుమాన్’ చిత్రం నేటి తరం స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానటువంటి వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. కేవలం తేజ సజ్జ మాత్రమే కాదు, బాలాదిత్య, తరుణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా ఎంతోమంది హీరోలు బాలనటులుగా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోలు గా ఎదిగిన వారే. ఇప్పుడు పైన ఫొటోలో ఉదయ్ కిరణ్ పక్కన కనిపిస్తున్న ఆ కుర్రాడిని ఎవరైనా గుర్తు పట్టారా?, ఇతని పేరు ఆనంద్ హర్షవర్ధన్.

    ఈ కుర్రాడు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ప్లే బ్యాక్ సింగర్ పీబీ శ్రీనివాస్ మనవడు. చిన్నతనం లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా నటించిన ‘బాలరామాయణం’ చిత్రం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఇందులో ఆనంద్ బాల వాల్మీకి, బాల హనుమాన్ గా నటిస్తాడు. చిన్నతనంలోనే ద్విపాత్రాభినయం చేసాడంటే, ఆయన టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాగే విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘ప్రేమించుకుందాం రా’ లో కూడా ఈ బుడ్డోడు వెంకటేష్ కి మేనల్లుడిగా నటించాడు. అలా బాలనటుడిగా సుమారు 25 చిత్రాల్లో నటించిన ఈయనకి ‘మనసంతా నువ్వే’ చిత్రం మంచి గుర్తింపుని తీసుకొచ్చింది.

    ఉదయ్ కిరణ్ హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలోని ‘తూనీగ..తూనీగ’ అనే పాట పెద్ద హిట్. ఇప్పటికీ కూడా ఈ పాటని మనం అనేక సందర్భాలలో వింటూనే ఉంటాం. అందులో కనిపించిన కుర్రాడే ఈ బుడ్డోడు. ఇప్పుడు ఈయన హీరోగా మారిపోయాడు. అలాగే ఈ పాటలో కనిపించిన పాప కావ్య కళ్యాణ్ రామ్ కూడా హీరోయిన్ గా మారిపోయి పలు సూపర్ హిట్స్ ని అందుకుంది. ఇక ఆనంద్ విషయానికి వస్తే ఈయన హీరో గా ‘ఆన్ ది వే’ అనే చిత్రం లో నటించాడు. ఈ సినిమా అసలు విడుదల అయ్యింది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అంత పెద్ద ఫ్లాప్ అన్నమాట. ఆ తర్వాత ఈయన ‘నిదురించు జహాపనా’ అనే చిత్రంలో కూడా హీరోగా నటించాడు. ఈ సినిమా పరిస్థితి కూడా అంతే, ఎప్పుడొచ్చిందో ఆడియన్స్ కి తెలియదు. ఇప్పుడు మంచి కథ తో మళ్ళీ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే ఈ కుర్రాడి లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా చూసేయండి.