Star Directors: టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు చాలామంది ఉన్నప్పటికి స్టార్ హీరోలతో ఇండస్ట్రీ హిట్లను సాధించిన దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక ప్రస్తుతం టాప్ 5 డైరెక్టర్లు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…
1. రాజమౌళి
బాహుబలి సినిమాతో పాన్ ఇండియాని షేక్ చేసిన దర్శకుడు రాజమౌళి…ప్రస్తుతం ఆయన పాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఆయన ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నాడు…
2. సుకుమార్
రంగస్థలం, పుష్ప సినిమాలతో ఇండస్ట్రీ హిట్లను సాధించిన సుకుమార్ తెలుగులో నెంబర్ 2 డైరెక్టర్ గా కొనసాగుతూ ఉండడం విశేషం…
3. సందీప్ రెడ్డి వంగ
అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలతో ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డివంగ…ప్రస్తుతం ఆయన నెంబర్ 3 పొజిషన్లో ఉండడం విశేషం…
4. నాగ్ అశ్విన్
కల్కి సినిమాతో ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన డైరెక్టర్ నాగ్ అశ్విన్… ప్రస్తుతం నెంబర్ ఫోర్ లో కొనసాగుతున్నాడు కల్కి సినిమా అతన్ని ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మార్చేసింది. అంతకు ముందు చేసిన ‘మహానటి’ సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఆయన ఈ సినిమాతో కమర్షియల్ గా భారీ సక్సెస్ ని సాధించి ఇప్పుడున్న దర్శకులెవ్వరికి తను తీసిపోయాననే ఒక బ్రాండ్ నేమ్ సంపాదించుకున్నాడు…
5. సుజీత్
‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజీత్ ఆ తర్వాత ప్రభాస్ తో సాహో అనే సినిమా చేశాడు. ఈ సినిమా ప్రేక్షకుల్లో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికి 500 కోట్ల వరకు కలెక్షన్ ను రాబట్టాయి. రీసెంట్ గా ఆయన ఓజీ సినిమాతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేశాడు. ఈ మూవీ తో 500 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టడంతో ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు తెలుగు సినిమా డైరెక్టర్లలో నెంబర్ ఫిఫ్త్ పొజిషన్ ని కైవసం చేసుకోవడం విశేషం…