https://oktelugu.com/

హౌస్ ఫుల్…100 శాతం ఆక్యుపెన్సీకి తెలంగాణ ప్రభుత్వం ఓకే

సినీ అభిమానులందరికి శుభవార్త… ఇన్నాళ్ళకు థియేటర్స్ కి పట్టిన గ్రహణం వీడింది. గతేడాదిలో కరోనా మహమ్మారి కారణంగా సినిమా థియేటర్లని మూసివేశాక దాదాపు తొమ్మిది నెలల అనంతరం కరోనా తగ్గుముఖం పట్టటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీ తో మాత్రమే నడిపేందుకు అనుమతులు ఇవ్వటం జరిగింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తే పెట్టుబడి తిరిగొస్తుందో లేదో అని భయపడుతూనే ధైర్యం చేసి కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. Also Read: రివ్యూ […]

Written By:
  • admin
  • , Updated On : February 5, 2021 / 04:41 PM IST
    Follow us on


    సినీ అభిమానులందరికి శుభవార్త… ఇన్నాళ్ళకు థియేటర్స్ కి పట్టిన గ్రహణం వీడింది. గతేడాదిలో కరోనా మహమ్మారి కారణంగా సినిమా థియేటర్లని మూసివేశాక దాదాపు తొమ్మిది నెలల అనంతరం కరోనా తగ్గుముఖం పట్టటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీ తో మాత్రమే నడిపేందుకు అనుమతులు ఇవ్వటం జరిగింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తే పెట్టుబడి తిరిగొస్తుందో లేదో అని భయపడుతూనే ధైర్యం చేసి కొన్ని సినిమాలు విడుదలయ్యాయి.

    Also Read: రివ్యూ : ‘జాంబి రెడ్డి’ – వింత అనిపించినా అక్కడక్కడా బాగుంది !

    ఇప్పుడిక ఆ భయాలను, అనుమానాలకు తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులిస్తూ జీవో జారీ చేసి ఇండస్ట్రీకి శుభవార్త తెలిపింది. ఇటివలే కేంద్రం ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుపుకోవ‌చ్చ‌ని చెప్పింది. ఈ మేర‌కు కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల మంత్రిత్వ శాఖ‌ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. సినిమాలు, థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 100 శాతం సీట్ల‌ను నింపుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు అందులో స్ప‌ష్టం చేసింది.

    Also Read: ఏ.ఎం.రత్నం గారిని మాత్రమే సినిమా అడిగాను: పవన్ కళ్యాణ్

    దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. టిక్కెట్టు కౌంటర్ వద్ద ఆరడుగుల దూరం పాటించాలి. అలాగే థియేటర్ సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్కులను ధరించాలి. ఎంట్రీ వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి. థియేటర్లో 24-30 ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవడమే కాకుండా హ్యాండ్ వాషర్స్, శానిటైజర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా 100 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వటంతో థియేటర్‌ యాజమాన్యాలు, ఇండస్ట్రీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్