Homeఎంటర్టైన్మెంట్గుడ్‌ లక్‌ సఖి టీజర్ వచ్చేసింది.. కీర్తి అదరగొట్టేసింది

గుడ్‌ లక్‌ సఖి టీజర్ వచ్చేసింది.. కీర్తి అదరగొట్టేసింది


కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పుడామే బిజీ హీరోయిన్‌. మహానటి తర్వాత ఆమె జాతకం పూర్తిగా మారిపోయింది. ఆ చిత్రంలో నటనకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి క్షణం తీరిక లేకుండా మారిపోయింది. వరుస ఆఫర్లు.. విజయాలతో అంతకంతకూ స్టార్డమ్‌ పెంచుకుంటోంది. అలాగని వచ్చిన ప్రతీ ఆఫర్కు ఓకే చెప్పడం లేదామె. కథ, తన పాత్ర నచ్చితేనే డేట్స్‌ ఇస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘పెంగ్విన్‌’ మూవీ కొద్ది రోజుల కిందటే ఓటీటీలో విడుదలైంది. సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినా కీర్తి నటనకు మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘మిస్‌ ఇండియా’ రిలీజ్‌కు రెడీగా ఉండగా.. నితిన్‌ సరసన నటించిన ‘రంగ్‌దే’ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రంగ్‌దే టీజర్కు ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది.

Also Read: ‘సన్ ఆఫ్‌ ఇండియా’గా మోహన్‌ బాబు

ఇప్పుడు మరో సినిమాతో కీర్తి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఆమె ప్రధాన పాత్రలో ‘గుడ్‌ లక్‌ సఖి’ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు టీజర్ను ప్రభాస్ విడుదల చేయగా.. తమిళ్ లో విజయ్ సేతుపతి.. మలయాళంలో పృథ్వీ రాజ్ రిలీజ్ చేశారు. గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీలో కీర్తి డీగ్లామర్ రోల్ పోషించింది. ఓ పల్లెటూరి పేద అమ్మాయిగా నటించింది. దురదృష్టవంతురాలిగా ముద్ర పడ్డ ఆ అమ్మాయి రైఫిల్ షూటింగ్‌ ఆటలో ఉన్నత శిఖరాలకు ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించాడు నగేశ్‌ కుకునూరు. సున్నితమైన భావోద్వేగాలతో గుడ్‌ లక్‌ సఖిని తీర్చిదిద్దుతున్నాడు. టీజర్ చూస్తూనే కీర్తి అద్భుతంగా నటించిందని అర్థమవుతోంది. సఖిని పెళ్లి చేసుకునేందుకు వస్తున్న పెళ్లి కొడుకు గుర్రంపై నుంచి కింద పడిపోవడంతో ‘ఊరంతా దీన్ని ఊరికే బ్యాడ్‌ లక్‌ సఖి బ్యాడ్‌ లక్‌ సఖి అంటారనుకుంటున్నావా’… ‘ఆ అమ్మి లక్కు అంతంత మాత్రమే’ అంటూ ఊరి ప్రజలు ఆమెను వెక్కిరిస్తుంటారు. అలాంటి అమ్మాయి రైఫిల్‌ షూటర్గా మారి గుడ్‌ లక్‌ సఖి అనిపించుకుంటుంది. మన రాతను మనమే రాసుకోవాలా అంటూ గంభీరంగా, సరే యాడ కాల్సాలా అంటూ …కీర్తి అమాయకంగా చెప్పే డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. వీధి నాటకాలు వేసే ఆర్టిస్టుగా ఆది పినిశెట్టి.. కోచ్‌గా జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజ్ సమర్పణలో వనున్న ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై సుధీర్ చంద్ర నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా నేరుగా విడుదల కానుంది.

Good Luck Sakhi Telugu Teaser | Keerthy Suresh | DSP | Aadhi Pinisetty | Nagesh Kukunoor

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version