Tollywood Heroes Dupe: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు షూటింగ్స్ లో పాల్గొన్నప్పుడు వాళ్లు కొన్ని సీన్లలో నటించినప్పటికీ కొన్ని రిస్కీ షాట్ లలో మాత్రం వాళ్ల డూప్ లు నటించడం జరుగుతుంది.ఎందుకంటే షూటింగ్ లో రిస్కీ షాట్స్ తీసినప్పుడు హీరోలకి ఏదైనా గాయలు అవ్వకుండా ఉండడానికి డైరెక్టర్ హీరో డూపులను పెట్టీ షూట్ చేస్తూ ఉంటారు.ఇప్పటికే ప్రభాస్ బాహుబలి సినిమాలో కిరణ్ రాజ్ అనే ఒక అబ్బాయి ప్రభాస్ డూప్ గా నటించడం జరిగింది. ఈయన ఆల్మోస్ట్ ప్రభాస్ కటౌట్ తో ప్రభాస్ లానే ఉంటాడు.అందుకే రాజమౌళి బాహుబలి కోసం ఆయనని ప్రిఫర్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం అది పురుష్ సినిమాలో కూడా ఆయనే డూప్ గా నటించాడు. ఇక ఇప్పుడు వస్తున్న సలార్ సినిమాలో కూడా ప్రభాస్ కి కిరణ్ రాజ్ డూప్ గా నటించాడు.
సలార్ సినిమాలో అయితే ప్రభాస్ కి చాలా పర్సెంట్ డూపుతోనే సినిమా లాగించడం జరిగిందనే టాక్ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కదు అనే కాదు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా మన సినిమాల్లో డూప్ లను ఎక్కువగా వాడుతుంటారు. ఇలా ప్రతి హీరో డూప్ లను వాడుతూ వాళ్ల చేత నటింప చేస్తున్నప్పుడు ఇక మన హీరోలు మాత్రం ఎందుకు ఉన్నారు అని చాలామంది వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్ సీన్స్ లో డూపులకు విపరితమైన గాయాలు తగులుతూ ఉంటాయి.. అలా వాళ్ళు మాత్రం దెబ్బలు తగిలించుకుంటే క్రెడిట్ మాత్రం హీరోలు దొబ్బేస్తున్నారు అని చాలామంది హీరోల మీద సహనం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. అయినా రియల్ హీరోలు అంటే వాళ్లు కానీ వీళ్ళు ఎలా అవుతారు అంటూ మరి కొంతమంది మన హీరోల మీద ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలకి కిరణ్ రాజ్ డూప్ గా చేస్తున్నాడు ప్రభాస్ కే కాకుండా ప్రతి ఒక్క స్టార్ హీరోకి కూడా వాళ్ళ డూప్ లు ఉంటారు. అంత డూప్ లే చేసిన తర్వాత హీరోయిన్ల తో రొమాంటిక్ సీన్లు మాత్రం హీరోలు చేస్తారా… అని ట్రేడ్ పండితులు సైతం వాళ్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…