Mahesh Babu On Sudheer Babu: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన ఎంత మంచి నటుడు అనేది మనం చాలా సినిమాల్లో చూసాం. సూపర్ స్టార్ గా తన సినిమాలతో చాలా ఎత్తుకు ఎదిగాడు…ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయిన ఆయన కొడుకు అయిన మహేష్ బాబు నటించిన సినిమాలు మాత్రం ఇండస్ట్రీలో సూపర్ హిట్ అవుతూ ఉన్నాయి. ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ కూతుర్లు అయిన మంజుల, ప్రియ దర్శిని ఇద్దరు కూడా సుధీర్ బాబుతో ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో వాళ్ళు చాలా విషయాలు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే సుధీర్ బాబు హీరోగా చేస్తున్న మామ మచ్చింద్రా అనే సినిమాలో అమ్మ సాంగ్ ఒకటి ఉంది దాన్ని రిలీజ్ చేయడానికి ప్రమోషన్ లో భాగంగా ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది.
ఈ డిస్కషన్ లో మహేష్ బాబు గురించి కూడా మాట్లాడడం జరిగింది అయితే సుధీర్ బాబు కి ప్రియ దర్శిని ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు స్కాన్ చేపిస్తే డాక్టర్ కూతురు పుట్టబోతుంది అని చెప్పారట. దానికి సుధీర్ బాబు చాలా సంతోషపడి ఆ విషయాన్ని తమ సన్నిహితులతో చెప్పడం జరిగిందట. మహేష్ బాబు తో కూడా ఈ విషయం చెప్పాడట దాంతో డెలివరీ అయిన తర్వాత కూతురు పుట్టిందని సుధీర్ బాబు వెళ్లి చూస్తే అక్కడ కూతురు కి బదులు కొడుకు పుట్టి ఉన్నాడట. అయితే ఎవరు పుట్టరో కూడా చూడక ముందే అందరూ కూతురు పుట్టినందుకు కంగ్రాట్స్ అంటూ సుధీర్ కి మెసేజ్ లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత సుధీర్ వెళ్లి చూస్తే అక్కడ బాబు పుట్టడం తో అతను షాక్ అయి అందరికీ కొడుకు పుట్టాడు అని మళ్ళీ వివరం గా కాల్ చేసి చెప్పాడట… మహేష్ బాబు కూడా తన చెల్లి అయిన ప్రియ దర్శిని డెలివరీ అయింది అనే విషయాన్ని తెలుసుకొని సుధీర్ బాబుకి కూతురు పుట్టినందుకు కంగ్రాట్స్ అంటూ మెసేజ్ పెట్టాడట. అప్పుడు సుధీర్ మహేష్ కి కాల్ చేసి కూతురు కాదు బాబు పుట్టాడని మహేష్ కి చెబితే మహేష్ బాబు కూడా ఒకసారి గా షాక్ అయ్యాడట…స్కాన్ లో ఏదో తేడా జరిగింది అని అనడం తో మహేష్ గొప్పొడివయ్య సామి నువ్వు అంటూ నవ్వుకున్నారట. ఈ ఇంటర్వ్యూ లో ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ఫన్నీ గా వీళ్ళు కూడా నవ్వుకున్నారు…