Telugu film industry: తెలుగు సినిమా కథలు ఇంటరెస్ట్‌గా ఉండవు అని ఇతర బాషలలో ఒకప్పుడు గట్టి పుకారు ఉండేది. కానీ కాలం మారేకొద్దీ తెలుగు కథకు విలువ పెరిగింది. దానికి తగ్గట్టుగానే తెలుగులోనూ గొప్ప కథలు వస్తున్నాయి. రొటీన్ కథలకు తెలుగు సినిమా ఇండస్ట్రీ కేరాఫ్ అడ్రస్ అంటూ ఎగతాళి చేసిన వారే.. ఇప్పుడు తెలుగు కథలే మాకు కావాలి అని అర్రులు చాస్తున్నారు.
ఏది ఏమైనా కాలం మారుతుంటుంది. అలాగే సినిమా ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతుంటాయి. కానీ, తెలుగు కథలు కూడా మారడం శుభసూచికం. మనం చూసుకుంటే.. ఈ మధ్యకాలంలో ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీల కంటే టాలీవుడ్ ప్రతి విషయంలో ముఖ్యంగా సాకేతికంగా పరంగా కూడా ముందు ఉంటుంది. ఇతర సినీ పరిశ్రమలకంటే తెలుగు పరిశ్రమ చాలా మెరుగ్గా ఉంది.
పైగా ప్రేక్షకులు కూడా తెలుగు సినిమాను చూసే తీరు మారింది. అందుకే, తెలుగు స్టార్ హీరోలు ఎంచుకుంటున్న కథలు కూడా మారాయి. దాంతో దర్శకులు తీస్తున్న విధానమూ మారింది. గతంలో స్టార్లు పూర్తిగా కమర్షియల్ మూసలోనే కథలు ఎంచుకొనేవారు. వారి వారి అభిమానులు కూడా వాటికే జై కొట్టేవారు. కానీ ఇప్పుడలా లేదు.
ఎంత గొప్ప హీరో అయినా సరే.. కథ, నటన, సినిమా తీసిన విధానం బాగోలేకపోతే ప్లాప్ అనే మాట వినక తప్పడం లేదు. అన్నిటి కంటే ముఖ్యంగా కేవలం ఫైట్లు, డ్యాన్స్ లూ, కొంచెం రొడ్డు కామెడీని పెట్టి తీసే సినిమాలను చూసి చూసి జనం మొహాలు వాచిపోయాయి. బహుశా ఇప్పటి తరం దర్శకులు, నటులు ఇది గమనించే రూట్ మార్చుకున్నారు.
Also Read: RRR Trailer : ‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలొచ్చాయ్..’ ఆర్ఆర్ఆర్ ట్రైలర్ బీభత్సం
దాంతో కథా నాణ్యత పెరిగింది. పూర్తిగా కొత్త వారితో తీసిన వైవిధ్యమైన చిత్రాలు కూడా ఎంతో ఆదరణకు నోచుకుంటున్నాయి. ఇది చాలా శుభ పరిణామం. విదేశీ సినిమాల దురాక్రమణతో ఆగిన మన సినిమా ప్రభ.. మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటూ ముందుకుపోతూ ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి.
Also Read: Balakrishna: బాలయ్య.. ఆ మార్పు త్వరగా లేకుండా చూసుకో !