Saiteja: అంచెలంచెలుగా ఎదిగిన సాయితేజ.. ‘రావత్’ను మెప్పించాడు?

Saiteja: త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టన్ బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కుప్పకూలిన సంగతి అందరికీ తెల్సిందే. ఈ సంఘటనలో ఆయన ఆయన భార్య మధులిక సహా మరో కొంతమంది ఆర్మీ సిబ్బంది ప్రాణాలను కోల్పోయారు. ఈ వార్త యావత్ దేశాన్ని కలిచివేసింది. ఇదే ఘటనలోనే తెలుగు జాతికి చెందిన సాయితేజ కూడా ఉన్నాడు. దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలు ఆయనకు కన్నీటీతో నివాళ్లర్పిస్తున్నాయి. సాయితేజ ప్రస్థానం.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కురబలకోట […]

Written By: NARESH, Updated On : December 9, 2021 12:41 pm
Follow us on

Saiteja: త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టన్ బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కుప్పకూలిన సంగతి అందరికీ తెల్సిందే. ఈ సంఘటనలో ఆయన ఆయన భార్య మధులిక సహా మరో కొంతమంది ఆర్మీ సిబ్బంది ప్రాణాలను కోల్పోయారు. ఈ వార్త యావత్ దేశాన్ని కలిచివేసింది. ఇదే ఘటనలోనే తెలుగు జాతికి చెందిన సాయితేజ కూడా ఉన్నాడు. దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలు ఆయనకు కన్నీటీతో నివాళ్లర్పిస్తున్నాయి.

Saiteja

సాయితేజ ప్రస్థానం..

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కురబలకోట మండల ఎగువరేగడలో సాయితేజ జన్మించాడు. రైతు మోహన్, భువనేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దవాడు సాయితేజ(29), చిన్నవాడు మహేష్ బాబు(27). వీరిద్దరు కూడా ఆర్మీ సైనికులే కావడం విశేషం.

సాయితేజ తిరుపతి ఎంఆర్‌పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, మదనపల్లెలో ఇంటర్ పూర్తి చేశాడు. మదనపల్లెలో డిగ్రీ చేరిన కొన్ని నెలల్లోనే ఆర్మీలో చేరాలని సాయితేజ నిర్ణయించుకున్నాడు. ఈమేరకు గుంటూరులో ఆర్మీ ప్రిపరేషన్‌కి వెళ్లి కొన్ని నెలల్లోనే సిపాయిగా విధుల్లో చేరాడు.

సాయితేజ తమ్ముడు మహేష్ సైతం ఆర్మీ ఉద్యోగానికి ఎంపికై ప్రస్తుతం సిక్కింలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సాయితేజ తొలుత ఆర్మీ డ్రైవర్‌గా విధుల్లో చేరిన కఠోర శ్రమతో త్రివిధ దళాధిపతి వ్యక్తిగత భద్రత సిబ్బంది స్థాయికి చేరుకున్నాడు. ఈస్థాయికి రావడానికి అతడు చాలనే కష్టపడాల్సి వచ్చింది. తొలుత డ్రైవర్ గా విధులు నిర్వహించిన సాయితేజ తర్వాత ఆర్మీ పరీక్షలు రాసి పారా కమాండోగా ఎంపికయ్యాడు.

ఆర్మీ శిక్షణలో సాయితేజ రాటుదేలాడు. ఆకాశ మార్గంలో నేరుగా శత్రు స్థావరాల వద్దకే వెళ్లి వారిని అంతమొందించే పారా ట్రూపర్‌లో కీలక సైనికుడిగా మారాడు. మెరుపు దాడులు చేయడంలో దిట్టయిన సాయి తేజ బెంగళూరు రెజిమెంట్, జమ్ము కశ్మీర్ ప్రాంతాల్లో విధులు నిర్వహించాడు. సాయితేజ శక్తి సామర్థ్యాలను గుర్తించిన బిపిన్ రావత్ తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు.

Also Read: హెలిక్యాప్టర్ ప్రమాదంలో భారత ఆర్మీ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కన్నుమూత

చివరిసారిగా సాయితేజ తన కుటుంబ సభ్యులతో ప్రమాదం జరగడానికి ముందురోజు సాయంత్రం మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే ఇంటికొస్తానని చెప్పాడు. ఈలోపే హెలికాప్టర్ ప్రమాదం జరుగడంతో సాయితేజ అమరుడయ్యాడు. కాగా రెండు వారాల కిందటే తన బ్యాచ్‌లోని స్నేహితుడు కూడా మరణించాడు.

సాయితేజ మృతి వార్త తెలిసిన వెంటనే అతడి భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞ కారులో తమిళనాడు బయల్దేరారు. అధికారిక లాంఛనాలు పూర్తయిన తర్వాత పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకు రానున్నారు. స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. డ్రైవర్ నుంచి పారా కమాండోగా ఎదిగిన సాయితేజ ఆర్మీ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Also Read: బిపిన్ రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదంపై విచారణకు ఆదేశం.. కొనసాగుతున్న ఉత్కంఠ.!