Gopichand And Nithiin: ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న మీడియం రేంజ్ హీరోలు ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక సతమతమవుతున్నారు. సీనియర్ హీరోలు వరుస సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు. స్టార్ హీరోలు మాస్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. అప్ కమింగ్ హీరోలు సైతం చిన్న సినిమాలతో సక్సెస్ లను సాధిస్తున్నారు. కానీ మీడియం రేంజ్ హీరోలు ఎలాంటి సినిమాలు చేయాలన్నా కూడా వాళ్లు చాలా వరకు ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది. ఇక అందులో కొంతమందికి సక్సెస్ వస్తే మరి కొంతమందికి ఫెయిల్యూర్స్ వస్తున్నాయి… ఇప్పుడున్న మీడియం రేంజ్ హీరోల్లో గోపీచంద్ కి సక్సెస్ లు రావడం చాలా కష్టమనే చెప్పాలి. కారణం ఏంటంటే ఆయన ఒకప్పుడు కమర్షియల్ సినిమాలని టాప్ లెవెల్ కి తీసుకెళ్లి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి వచ్చే ఏ సినిమా ప్రేక్షకులను అలరించడం లేదు. కారణం ఏంటి అంటే ఆయన చేసే సినిమాలకు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం లేదు. దానివల్లే గోపీచంద్ చాలావరకు తర్జన భర్జనలు పడుతున్నాడు…
ఇక తనతో పాటుగా జయం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన నితిన్ సైతం కెరియర్ స్టార్టింగ్ లో మంచి విజయాలు సాధించాడు. మళ్ళీ మధ్యలో వరుసగా 13 డిజాస్టర్లను మూట గట్టుకున్నాడు. ఇక ఆయన కెరియర్ పోయింది అనుకున్న తరుణంలో ఇష్క్ సినిమాతో సక్సెస్ ని సాధించిన ఆయన మరోసారి ఫ్లాప్ ల బాట పట్టాడు.
ప్రస్తుతం ఆయన నుంచి ఏ సినిమా వచ్చినా కూడా అది ఆశించిన మేరకు సక్సెస్ లను సాధించడం లేదు. తద్వారా ఆయన ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది. ఏ సినిమా తనకి బాగా సెట్ అవుతోంది అనే ధోరణిలో కూడా ఆయన నుంచి కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఈ ఇద్దరు హీరోలను పట్టాలంటే మాత్రం వాళ్ళు కొత్త పంథాలో సినిమాలను చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా రొటీన్ రెగ్యూలర్ సినిమాలను చేసుకుంటూ వెళ్తే వాళ్లకు సక్సెస్ రావడం చాలా కష్టమని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…