Rajinikanth Assets: సౌత్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగిన నటుడు రజినీకాంత్… బస్ కండక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి వచ్చాడు. కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. తమిళంలో తన కెరియర్ ని స్టార్ట్ చేసిన ఆయన తన ప్రతి సినిమాని తెలుగులో డబ్ చేసి ఇక్కడి ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు… ఈ క్రమంలో ఆయన నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ ఆయన్ని సూపర్ స్టార్ గా నిలిపాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ‘కూలీ’ సినిమాతో కొంతవరకు పడిపోయినప్పటికి 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా రజనీకాంత్ ఈ మూవీలో తన స్వాగ్ ను చూపించాడు.
అలాంటి రజనీకాంత్ తన ఎంటైర్ కెరీర్ లో చేసిన సినిమా ద్వారా గాని, బిజినెస్ ల ద్వారా 8 వేల కోట్ల వరకు ఆస్తినైతే కూడబెట్టాడు. రజినీకాంత్ కి సౌందర్య, ఐశ్వర్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు… రజినీకాంత్ తన సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తి మొత్తాన్ని తన కూతుర్లకి కాకుండా అనాధ శరణాలయాలకు రాసి ఇచ్చాడనే వార్తలు అప్పట్లో పెను సంచలనాలను క్రియేట్ చేశాయి.
ఇందులో ఎంతవరకు నిజం ఉందని కొంతమంది ఆరా తీస్తే నిజంగానే రజినీకాంత్ తన తదనంతరం తన ఆస్తుల్లో చాలా భాగం అనాధలకు పేదవారికి అందాలని ముందుగానే ఒక వీలునామ రాసి పెట్టాడట. ఇక దానికి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. రజినీకాంత్ డౌన్ టు ఏర్తుంటాడు. మనిషి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు.
అందుకే ఆపదలో ఉన్నవారికి తనకు తోచిన సహాయాన్ని చేస్తూ జనాల్లో నిజమైన హీరోగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అందుకే అతని సినిమాలను చూడడానికి చాలా మంది ఇష్టపడతారు. రజినీకాంత్ నుంచి మరోసారి భారీ సక్సెస్ లు వస్తే చూడాలని చాలామంది ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నెల్సన్ డైరెక్షన్లో చేస్తున్న ‘జైలర్ 2’ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది…