Mahesh Babu Hit Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ వాళ్ళను స్టార్లుగా మార్చిన దర్శకులను మాత్రం ఎవరూ పట్టించుకోరు. మరి ఏది ఏమైనా కూడా స్క్రీన్ మీద కనిపించేది హీరోలే కాబట్టి ప్రేక్షకులు సైతం వాళ్ల మీదనే ఎక్కువ అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే కొంతమంది హీరోలు ఇక్కడ మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తూ స్టార్ హీరోలుగా వెలుగొందుతుంటే మరికొందరు మాత్రం చేసిన సినిమాలతో సక్సెస్ లను సాధించలేక ఢీలా పడిపోతూ ఉంటారు… ఇక సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…కెరియర్ స్టార్టింగ్ లో మహేష్ బాబుకి సరైన సక్సెసులైతే రాలేదు. ఆయనతో పాటు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు టాప్ పొజిషన్ ని అందుకున్నప్పటికి ఆయన మాత్రం మొదటి మూడు నాలుగు సినిమాలతో డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఉదయ్ కిరణ్ లాంటి నటుడు టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు…ఆయన చేయాల్సిన రెండు సినిమాలను మహేష్ బాబు చేసి భారీ విజయాలను అందుకొని స్టార్ హీరోగా వెలుగొందాడనే విషయం మనలో చాలామందికి తెలియదు…
Also Read: స్పిరిట్ vs ఎస్ఎస్ఎంబి 29 ల మధ్య భారీ పోటీ ఉండబోతుందా..?
అందులో మొదటిది ఒక్కడు సినిమా కాగా, రెండోవది అతడు…అయితే ఈ రెండు సినిమాలను మొదట ఉదయ్ కిరణ్ తో చేయాలని దర్శకులు ప్రణాళికలు రూపొందించుకున్నారట. కానీ అనుకోని కారణాలవల్ల ఈ రెండు సినిమాలు మహేష్ బాబుకి సెట్ అవ్వడం ఆయనతో ఈ సినిమాలను చేసి సక్సెస్ సాధించడం చాలా చక జరిగిపోయాయి.
ఈ విజయాలు అటు దర్శకులకు, ఇటు మహేష్ బాబుకి చాలా వరకు ప్లస్ అయింది. మరి ఏది ఏమైనా కూడా ఉదయ్ కిరణ్ లాంటి నటుడితో సినిమా చేయడానికి అప్పట్లో చాలా మంది దర్శకులు ఆసక్తి చూపించినప్పటికి తన కెరియర్ లో వచ్చిన కొన్ని అడ్డంకుల కారణంగా ఆయన స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు.
Also Read: ‘కూలీ’ లో కమలహాసన్..ట్రైలర్లో పెద్ద లీక్..నరాలు కట్ అయ్యే ట్విస్ట్!
ఇక ఒకానొక సందర్భంలో ఆయన సినిమాలు చేయలేక అప్పులు ఎక్కువగా పెరిగిపోవడం, ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోకపోవడంతో డిప్రెషన్ కి లోనైన ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయిన విషయం మనకు తెలిసిందే. ఉదయ్ కిరణ్ ఎంత తొందరగా టాప్ పొజిషన్ ను చేరుకున్నాడో అంతే తొందరగా పాతాళానికి పడిపోయాడు… మొత్తానికైతే మహేష్ బాబు ఉదయ్ కిరణ్ చేయాల్సిన సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకోవడం నిజంగా మహేష్ బాబు చాలా వరకు కలిసి వచ్చిందనే చెప్పాలి…